LOADING...
ChatGPT to Claude AI: క్లాడ్ ఏఐకి పెరుగుతున్న ఆదరణ.. చాట్‌జీపీటీ నుంచి ఎలా స్విచ్ అవ్వాలి?
క్లాడ్ ఏఐకి పెరుగుతున్న ఆదరణ.. చాట్‌జీపీటీ నుంచి ఎలా స్విచ్ అవ్వాలి?

ChatGPT to Claude AI: క్లాడ్ ఏఐకి పెరుగుతున్న ఆదరణ.. చాట్‌జీపీటీ నుంచి ఎలా స్విచ్ అవ్వాలి?

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 03, 2026
12:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఓపెన్‌ఏఐకి చెందిన చాట్‌జీపీటీ చుట్టూ వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో, పలువురు యూజర్లు ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నారు. తాజాగా అమెరికా రక్షణ శాఖ అభ్యర్థనను తిరస్కరించిన నేపథ్యంలో ఆంత్రోపిక్ కంపెనీ రూపొందించిన క్లాడ్ ఏఐ (Claude AI)కు మంచి ఆదరణ పెరుగుతోంది. దీంతో చాట్‌జీపీటీనుంచి క్లాడ్ కి మారాలని భావిస్తున్నవారికి డేటా ఎలా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి? అకౌంట్ ఎలా డిలీట్ చేయాలి? అనే అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వివరాలు 

చాట్‌జీపీటీలో మీ డేటాను సేవ్ చేసుకోవాలంటే..

ముందుగా చాట్‌జీపీటీలో మీ డేటాను సేవ్ చేసుకోవాలంటే Settings లోకి వెళ్లాలి. అక్కడ Personalization సెక్షన్‌లో Memory అనే ఆప్షన్ కనిపిస్తుంది. Manage పై క్లిక్ చేసి మీకు సేవ్ అయిన సమాచారాన్ని పరిశీలించాలి. అవసరమైన వివరాలను కాపీ చేసుకోవచ్చు. లేదా పూర్తి చాట్ హిస్టరీని ఎగుమతి (Export) చేయాలంటే Settings > Data Controls > Export Data ఎంపిక చేసుకోవాలి. దీంతో మీ మొత్తం డేటా ఫైల్ రూపంలో లభిస్తుంది.

వివరాలు 

క్లాడ్లోకి ఇంపోర్ట్ చేయడం కూడా సులభమే

అదే డేటాను క్లాడ్లోకి ఇంపోర్ట్ చేయడం కూడా సులభమే. ముందుగా క్లాడ్ ఓపెన్ చేసి Settings > Capabilities లోకి వెళ్లి Memory ఆప్షన్ ఆన్‌లో ఉందో లేదో చూసుకోవాలి. తర్వాత కొత్త చాట్ ప్రారంభించి "ఇవి నా ముఖ్యమైన వివరాలు, వీటిని గుర్తుంచుకోండి" వంటి ప్రాంప్ట్ ఇవ్వాలి. ఆ తర్వాత మీ కాపీ చేసిన సమాచారాన్ని పేస్ట్ చేయాలి. ఎగుమతి చేసిన ఫైళ్లైతే నేరుగా రా డేటాను పేస్ట్ చేయకుండా, "వీటిని పరిశీలించి నా ప్రాధాన్యాల సారాంశం చెప్పండి" అని అడగడం మంచిది.

Advertisement

వివరాలు 

అకౌంట్‌ను పూర్తిగా డిలీట్ చేయాలంటే..

ఇక చాట్‌జీపీటీ నుంచి పూర్తిగా బయటపడాలంటే కేవలం సబ్‌స్క్రిప్షన్ రద్దు చేస్తే సరిపోదు. ముందుగా Settings > Personalization > Memory లోకి వెళ్లి సేవ్ చేసిన మెమరీ డేటాను తొలగించాలి. అదనంగా చాట్‌లో "నా మొత్తం మెమరీ, వ్యక్తిగత డేటాను డిలీట్ చేయండి" అని టైప్ చేయడం మంచిది. చివరిగా అకౌంట్ మేనేజ్‌మెంట్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి మీ అకౌంట్‌ను పూర్తిగా డిలీట్ చేయాలి. ఇలా చేస్తే మీ డేటా పూర్తిగా తొలగించబడుతుంది.

Advertisement