Apple: విక్రయాల వృద్ధిలో 'ఆపిల్' సంచలన రికార్డు.
ఆపిల్ 2024 మూడవ త్రైమాసికానికి సంబంధించి తన ఆర్థిక ఫలితాలను తాజాగా వెల్లడించింది. జూన్ త్రైమాసికంలో ఆపిల్ కొత్త రికార్డును సాదించిన ఆ సంస్థ సీఈఓ టిమ్ కుక్ పేర్కొన్నాడు. గతేడాది కంటే ఈ ఏడాది 5శాతం పెరిగి $85.8 బిలియన్లకు చేరుకుందన్నారు. AI వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంలో ఇన్నోవేషన్‌లో కంపెనీ పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని వెల్లడించారు.
ఐప్యాడ్ అమ్మకాలు పెరిగాయి
తాము కెనడా, మెక్సికో, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, ఇండియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్‌తో సహా మరిన్ని దేశాలు, ప్రాంతాలలో త్రైమాసిక ఆదాయ రికార్డులను నెలకొల్పామని టిమ్ కుక్ వెల్లడించారు. ఆపిల్ సేవల్లో ఆల్ టైమ్ రెవెన్యూ రికార్డును సాధించడంతో ప్రస్తుతం 14 శాతం పెరిగిందన్నారు. ఐప్యాడ్ అమ్మకాలు గత ఏడాది $5.79 బిలియన్ల నుండి $7.16 బిలియన్లకు పెరిగాయి. ఇది అంచనా వేసిన $6.61 బిలియన్ల కంటే బాగా పెరిగింది.
ఏడాదికి 2 శాతం పెరిగింది
మాక్ $7 బిలియన్ల ఆదాయాన్ని ఆర్జించిందని, ఇది సంవత్సరానికి 2 శాతం పెరిగిందని సీఎఫ్ఓ లూకా వివరించారు. లాటిన్ అమెరికా, ఇండియా, దక్షిణాసియా మార్కెట్లలో తాము ఘనమైన పనితీరును ప్రారంభించామన్నారు. జూన్ 29, 2024తో ముగిసిన ఆర్థిక త్రైమాసికంలో, ఆపిల్ $85.8 బిలియన్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఇది ఏడాదికి 5 శాతం పెరుగుదలను సూచిస్తుందన్నారు.