Page Loader
Sunita Williams: అంతరిక్షం నుంచి భారత్‌ ఎలా కనిపించిందో తెలిపిన సునీత
అంతరిక్షం నుంచి భారత్‌ ఎలా కనిపించిందో తెలిపిన సునీత

Sunita Williams: అంతరిక్షం నుంచి భారత్‌ ఎలా కనిపించిందో తెలిపిన సునీత

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 01, 2025
10:10 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams), దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో ఉండి ఇటీవల భూమి మీద సురక్షితంగా చేరిన తరువాత, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్‌తో కలిసి బాహ్య ప్రపంచంలోకి వచ్చారు. నాసా (NASA) నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొని, వారు రోదసిలో తమ అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా, మీడియా వారు సునీతా విలియమ్స్‌ను "భారత్ ఎలా కన్పించిందో?" అన్న ప్రశ్న అడిగారు. ఆమె ఆ ప్రశ్నకు స్పందిస్తూ, "భారత్ చాలా అద్భుతంగా కన్పించింది" అని చెప్పింది. త్వరలోనే భారత్‌కు వచ్చేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు.

వివరాలు 

మత్స్యకారుల పడవలు మాకు సిగ్నల్‌లాగా పనిచేసేవి: సునీత 

సునీతా విలియమ్స్ తన అనుభవాలను వివరిస్తూ, "భారత్ చాలా అద్భుతంగా ఉంది. మేము హిమాలయాలపై ప్రయాణించినప్పుడు బుచ్ విల్మోర్ కెమెరాలో ఆ మంచు కొండలను తీసుకున్నారు. తూర్పు వైపు నుంచి గుజరాత్, ముంబయి ప్రాంతాలను దాటి వెళ్ళేటప్పుడు, తీరం మీద మత్స్యకారుల పడవలు మాకు సిగ్నల్‌లాగా పనిచేసేవి. మొత్తంగా, భారత్ నాకు ఇలా కన్పించింది: పెద్ద నగరాల నుంచి వెలువడుతున్న లైట్ల నెట్‌వర్క్ చిన్న నగరాల మీదుగా వెళ్ళిపోతున్నట్లుగా కనిపిస్తోంది. హిమాలయాలు అయితే అసలు అద్భుతం" అని తెలిపింది. ఇక, భారత్‌కు వచ్చే అవకాశాల గురించి ఆమె ప్రస్తావించారు. "

వివరాలు 

అంతరిక్ష యాత్రల్లో విజయాలు సాధిస్తున్న దేశాల సరసన భారత్ 

నా తండ్రి పుట్టిన దేశానికి త్వరలోనే తిరిగి వెళ్లాలని నేను భావిస్తున్నాను. అక్కడి బంధువులతో, ప్రజలతో కలసి, నా అంతరిక్ష అనుభవాలను వారితో పంచుకోవాలనుకుంటున్నాను" అని సునీతా ఆనందంగా పేర్కొంది. అలాగే, "భారత్ అద్భుతమైన ప్రజాస్వామ్య దేశం, ఇది అంతరిక్ష యాత్రల్లో విజయాలు సాధిస్తున్న దేశాల సరసన నిలుస్తుంది. నేను ఈ దేశానికి చెందినదానిగా గర్వపడతాను" అని ఆమె పేర్కొంది. సునీతా విలియమ్స్ 1965 సెప్టెంబర్ 19న ఒహాయోలో జన్మించారు. ఆమె భారత సంతతికి చెందిన న్యూరోఅనాటమిస్ట్ దీపక్ పాండ్యా, స్లొవీన్‌ అమెరికన్ ఉర్సులైన్ బోనీలకు కుమార్తె. దీపక్ పాండ్యా గుజరాత్‌లో జన్మించారు. 1958లో ఆయన అగ్రరాజ్యానికి వలస వెళ్లారు.