Loading...
YouTube Video Removals India: యూట్యూబ్‌ యూజర్లు భారత్‌ షాక్‌...భారీగా వీడియోలు తొలగింపు
యూట్యూబ్‌ యూజర్లు భారత్‌ షాక్‌...భారీగా వీడియోలు తొలగింపు

YouTube Video Removals India: యూట్యూబ్‌ యూజర్లు భారత్‌ షాక్‌...భారీగా వీడియోలు తొలగింపు

వ్రాసిన వారు Balachander Sharma
Nov 26, 2026
12:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

యూట్యూబ్‌ నుంచి వీడియోల తొలగింపులో భారత్‌ అగ్రస్థానంలో నిలిచింది. 2026 ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్య భారత్‌లో అప్‌లోడ్‌ చేసిన 34.4 లక్షల వీడియోలను యూట్యూబ్‌ తొలగించింది. ప్రపంచవ్యాప్తంగా ఇదే అత్యధిక సంఖ్య. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే భారత్‌లో తొలగించిన వీడియోలు 28 శాతం పెరిగాయి. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ ఉల్లంఘనల కారణంగా యూట్యూబ్‌ మొత్తం 1.1 కోట్ల వీడియోలను తొలగించింది. అందులో దాదాపు 31 శాతం వీడియోలు భారత్‌కు సంబంధించినవే కావడం గమనార్హం.

Details

అమెరికా కంటే భారత్‌లోనే ఎక్కువ

ఈ జాబితాలో అమెరికా రెండో స్థానంలో ఉంది. అక్కడ 12.4 లక్షల వీడియోలను యూట్యూబ్‌ తొలగించింది.

ఆ తర్వాత ఇండోనేషియా 9.2 లక్షల వీడియోలతో మూడో స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా తొలగించిన వీడియోలను పరిశీలిస్తే పిల్లల భద్రతకు సంబంధించిన ఉల్లంఘనలు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి.

ఏకంగా 68.2 శాతం వీడియోల తొలగింపులు చైల్డ్‌ సేఫ్టీకి సంబంధించినవే. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తొలగించిన వీడియోల్లో 98.6 శాతాన్ని తొలుత యూట్యూబ్‌ ఆటోమేటెడ్‌ సిస్టమ్సే గుర్తించాయి.

Details

భారత్‌ నుంచి గూగుల్‌కు రిమూవల్‌ రిక్వెస్టులు

వీడియోల తొలగింపుతో పాటు భారత్‌ నుంచి గూగుల్‌కు వచ్చే కంటెంట్‌ రిమూవల్‌ అభ్యర్థనలు కూడా భారీగా పెరిగాయి.

2026 జనవరి నుంచి జూన్‌ వరకు భారత్‌ నుంచి వచ్చిన 4,006 అభ్యర్థనల్లో 3,399 యూట్యూబ్‌కు సంబంధించినవే.

మొత్తం గూగుల్‌ సేవలకు వచ్చిన అభ్యర్థనలు గత ఆరు నెలలతో పోలిస్తే 61 శాతం పెరిగి 65,091 అంశాలకు చేరాయి. ఈ జాబితాలో రష్యా, దక్షిణ కొరియా తర్వాత భారత్‌ మూడో స్థానంలో ఉంది.

ADVERTISEMENT

Details

డిఫమేషన్‌ కేసులే ఎక్కువ

భారత్‌ నుంచి వచ్చిన అభ్యర్థనల్లో పోలీసుల వాటా 2,870 కాగా, కోర్టుల నుంచి 695 అభ్యర్థనలు వచ్చాయి.

కారణాలను చూస్తే పరువు నష్టం (డిఫమేషన్‌) 2,130 అభ్యర్థనలతో ముందుంది. భారత అభ్యర్థనల ఆధారంగా గూగుల్‌ స్థానిక చట్టాలను ఉల్లంఘించిన 19,883 అంశాలను తొలగించింది.

మరో 1,415 అంశాలపై తన సొంత విధానాల ప్రకారం చర్యలు తీసుకుంది. అయితే 19,402 అంశాలపై ఎలాంటి చర్య తీసుకోలేదు. మరో 17,473 అంశాల విషయంలో చర్య తీసుకోవడానికి తగిన సమాచారం లేదని గూగుల్‌ తెలిపింది.

ADVERTISEMENT