Instagram: ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో కొత్త ఫీచర్.. ఇప్పుడు మీకు నచ్చిన స్పీడ్‌లో వీడియోలు
ఈ వార్తాకథనం ఏంటి
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కొన్నిసార్లు ఎక్కువ నిడివి ఉన్న రీల్స్ ఫీడ్‌లో కనిపిస్తుంటాయి. అప్పుడు వాటిని మనకు అనుకూలమైన వేగంతో చూడలేక యూజర్లు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా యూట్యూబ్, ఫేస్ బుక్ వంటి యాప్‌లకు అలవాటు అయిన వాళ్లు ఇన్‌స్టాగ్రామ్ వాడేటప్పుడు ఈ సమస్యను తరచూ ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. అదే ప్లే బ్యాక్ స్పీడ్ కంట్రోల్.
వివరాలు
రీల్స్‌కు స్పీడ్ కంట్రోల్ ఫీచర్
ఇకపై ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను మనకు నచ్చిన వేగంతో చూడొచ్చు. రీల్స్ ప్లే అవుతున్న సమయంలో 0.5x, 1x, 2x, 3x వంటి స్పీడ్ ఆప్షన్లు కనిపిస్తాయి. దీని వల్ల పొడవైన రీల్స్‌ను తక్కువ సమయంలో పూర్తి చేయడం సులభం అవుతుంది. ఇలా ఉపయోగించాలి ఈ ఫీచర్‌ను ఉపయోగించాలంటే రీల్స్ సెక్షన్‌లోకి వెళ్లాలి. అక్కడ కుడి వైపు కింద భాగంలో కనిపించే మెనూపై క్లిక్ చేస్తే స్పీడ్ కంట్రోల్ ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో మనకు కావాల్సిన వేగాన్ని ఎంచుకుని వీడియోను చూడవచ్చు.
వివరాలు
పాత విధానానికి గుడ్‌బై
ఇంతకుముందు రీల్స్ చూస్తున్నప్పుడు స్క్రీన్‌ను నొక్కి పట్టుకుంటే మాత్రమే వేగంగా ప్లే అయ్యే సదుపాయం ఉండేది. అయితే ఈ విధానం అంత సౌకర్యవంతంగా లేదని యూజర్లు అభిప్రాయపడ్డారు. దీంతో ఇన్‌స్టాగ్రామ్ ఈ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పటికైతే కొంతమందికే ప్రస్తుతం ఈ ప్లే బ్యాక్ స్పీడ్ కంట్రోల్ ఫీచర్‌ను పరిమిత సంఖ్యలో యూజర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చారు. త్వరలో ఇది అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.