LOADING...
Instagram: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు శుభవార్త… చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఫీచర్ వచ్చేస్తోంది
ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు శుభవార్త… చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఫీచర్ వచ్చేస్తోంది

Instagram: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు శుభవార్త… చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఫీచర్ వచ్చేస్తోంది

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 03, 2025
08:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం చాలా మంది సోషల్ మీడియాలో వీడియోలు చూడడటం చాలా ఇష్టపడుతున్నారు. అయితే, అదే సమయంలో ఒకేసారి చాలా పనులు చేయడం కొంచెం కష్టమవుతోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెడుతోంది. మెటా సంస్థకు చెందిన ఇన్‌స్టాగ్రామ్ యాప్ వినియోగదారులకు మరింత సౌకర్యం కల్పించేందుకు నిరంతరం కొత్త ఫీచర్లను అందిస్తోంది. తాజాగా జోడించబోయే ఫీచర్ పేరు పిక్చర్-ఇన్-పిక్చర్ (PiP). దీని సహాయంతో యూజర్లు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను ఒక చిన్న ఫ్లోటింగ్ విండోలో ప్లే చేస్తూ, అదే సమయంలో ఇతర యాప్స్‌ను కూడా ఉపయోగించవచ్చు.

వివరాలు 

యాప్‌లో "Try Picture in Picture" అనే పాప్-అప్ సందేశం

ఈ PiP ఫీచర్ ఆన్‌లో ఉన్నప్పుడు,ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను మినిమైజ్ చేసినా వీడియో స్క్రీన్‌పై కొనసాగుతుంది. ఇప్పటికే కొంతమంది యూజర్లకు యాప్‌లో "Try Picture in Picture" అనే పాప్-అప్ సందేశం కనబడుతోంది. దానిపై క్లిక్ చేస్తే రీల్ వీడియో చిన్న విండోలో ప్లే అవుతుంది. ఇది ఇతర యాప్స్‌ను ఉపయోగిస్తున్నప్పుడు కూడా స్క్రీన్‌పై కనిపిస్తుంది. అంతేకాకుండా, ఈ మోడ్‌ను ఇన్‌స్టాగ్రామ్ సెట్టింగ్స్‌లో యూజర్ తన ఇష్టానుసారం ఆన్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ ఫీచర్‌ను కొందరు యూజర్లకు టెస్ట్ చేస్తున్నారు. అయితే, వచ్చే కొన్ని నెలల్లో మెటా దీన్ని మరింత విస్తృతంగా అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.

వివరాలు 

ఈ PiP ఫీచర్‌ను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చిన టిక్‌టాక్, యూట్యూబ్

ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోసెరి కూడా ఈ ఫీచర్‌పై పని జరుగుతోందని గతంలో స్పష్టం చేశారు. ఇప్పుడు ట్రయల్స్ జరుగుతున్నందున, త్వరలోనే యూజర్లందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అర్థమవుతోంది. టిక్‌టాక్, యూట్యూబ్ వంటి పోటీ యాప్‌లు ఈ PiP ఫీచర్‌ను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చాయి. ఇన్‌స్టాగ్రామ్ మాత్రం ఇప్పటివరకు ఈ లోపాన్ని ఎదుర్కొంటోంది. ఇప్పుడు ఈ సదుపాయం ద్వారా యూజర్లు వీడియోలను చూసుకుంటూ మిగతా పనులు కూడా చేయగలరు. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో వీక్షణలు మరింత పెరగవచ్చు.

వివరాలు 

ఇన్‌స్టాగ్రామ్ కి భారతదేశ యువతలో విపరీతమైన ఆదరణ

అలాగే కంటెంట్ క్రియేటర్లకు తమ రీల్స్ ఎక్కువ మంది ప్రేక్షకుల వరకు చేరే అవకాశం ఉంటుంది. భారతదేశంలో ఇన్‌స్టాగ్రామ్ యువతలో విపరీతమైన ఆదరణ పొందింది. ఫోటోలు, రీల్స్, స్టోరీస్ ద్వారా కంటెంట్ క్రియేషన్‌లో ఒక పెద్ద మార్పు తీసుకువచ్చింది. చిన్న వ్యాపారాలు, పెద్ద కంపెనీలు, ఇన్ఫ్లూయెన్సర్లు కూడా తమ బ్రాండ్ ప్రమోషన్ కోసం ఈ ప్లాట్‌ఫార్మ్‌ను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ట్రెండ్స్, కల్చర్, వినోదానికి ఇది ఇప్పుడు ప్రధాన వేదికగా నిలిచింది.