ఆరీఫీషియల్ ఇంటెలిజెన్స్ లో అధికంగా పెట్టుబడులు: 2025కల్లా 200బిలియన్ డాలర్లు; గోల్డ్ మాన్ సాచ్
ఈ వార్తాకథనం ఏంటి
కృత్రిమ మేధ ఎంత వేగంగా విస్తరిస్తుందో చెప్పాల్సిన పనిలేదు. ఛాట్ జీపీటీ వచ్చిన తర్వాత ప్రతీ ఒక్కరి నోట ఏఐ మాట వినిపిస్తోంది. అనేక రంగాల్లో ఏఐ వాడకం పెరుగుతోంది.
అలాగే ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ లో పెట్టుబడులు కూడా పెరగనున్నాయి. గోల్డ్ మాన్ సాచ్ ప్రకారం 2025కల్లా ఏఐలో 200బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నారట.
ప్రపంచవ్యాప్తంగా 200బిలియన్ డాలర్లు ఏఐ సంబంధిత విషయాల్లో పెట్టబడులు జరగనున్నాయని అంచనా వేస్తున్నారు. ఏఐ పై రోజురోజుకూ కార్పోరేట్ కంపెనీల ఆసక్తి పెరుగుతోందని అంటున్నారు.
Details
లీడర్ గా అమెరికా
ఏఐ ఉత్పత్తులను అందరికంటే ముందుగా గుర్తించి వాడుకోవడంలో అమెరికా ముందంజలో ఉంటుందని, ఏఐ లీడర్ గా అమెరికా ఉండనుందని గోల్డ్ మాన్ సాచ్ తెలియజేసింది.
2025కల్లా ఒక్క అమెరికాలోనే ఏఐ పై 100కోట్ల పెట్టుబడులు రానున్నాయని గోల్డ్ మాన్ సాచ్ చెబుతోంది.
ఏఐ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 4.4ట్రిలియన్ ఎకానమీ రానుందట.
ఏఐ ద్వారా ఆర్థికంగా ఎదుగుదల కనిపిస్తుందనే వాదనలు వినిపిస్తున్నా, ప్రైవసీ, ఉద్యోగాలు కోల్పోవడం వంటి విషయాలు ఆందోళనకరంగా కనిపిస్తున్నాయి.