Apple iPhone 15: త్వరలో టైప్-సి.. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా?
ఆపిల్ సంస్థ ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను సెప్టెంబర్ 12న జరిగే ఈవెంట్‌లో వీటిని తీసుకొస్తారని సమాచారం. సాధారణంగా ఇప్పటిదాకా వచ్చిన ఐఫోన్ లలో Lightning Port ఉండేది. దానివల్ల ఐఫోన్ యూజర్లు అత్యవసర సమయంలో ఛార్జింగ్ త్వరలోపెట్టడానికి ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అట్లాగే ఈ మధ్య వచ్చే అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉంటోంది. ఇది ఐఫోన్లలో లేదన్నది యూజర్ల నుంచి ఉన్న ఫిర్యాదుల్లో ఒకటి. వీటన్నింటికీ ఆపిల్ తన 15 సిరీస్‌తో సమాధానం చెప్పలనుకుంటోందట. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్లను ఐఫోన్ 15 సిరీస్‌లో ఆపిల్ తీసుకురాబోతోంది.
యాపిల్ సర్టిఫై చేసిన కేబుళ్ల ద్వారా మాత్రమే ఫాస్ట్ ఛార్జింగ్
వచ్చే సంవత్సరం అమల్లోకి రాబోతున్న ఈయూ రెగ్యులేషన్స్‌కు అనుగుణంగా Type -C ఛార్జింగ్ ఉన్న ఈ మోడళ్లను ఆపిల్ సంస్థ తీసుకువస్తోందని విశ్వసనీయ సమాచారం. అంతేకాకుండా ఐఫోన్ 15 సిరీస్‌లో వచ్చే 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ మోడళ్లకు మాత్రమే 35W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం తీసుకువస్తారట. ఇక్కడో చిన్న ట్విస్ట్ ఏంటంటే ఆపిల్ సర్టిఫై చేసిన కేబుళ్ల ద్వారా మాత్రమే ఫాస్ట్ ఛార్జింగ్ అయ్యేలా ఆప్టిమైజ్ చెయ్యబోతున్నట్లు ఊహాగానాలూ ఉన్నాయి. ఇక గతేడాది తీసుకొచ్చిన ఐఫోన్ 14 ప్రోలో 27W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఇచ్చారు. ఐఫోన్ 14లో 20W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఇచ్చారు.