Page Loader
Iran: అంతరిక్షంలోకి విజయవంతంగా ఉపగ్రహాన్ని పంపిన ఇరాన్ 
అంతరిక్షంలోని విజయవంతంగా ఉపగ్రహాన్ని పంపిన ఇరాన్

Iran: అంతరిక్షంలోకి విజయవంతంగా ఉపగ్రహాన్ని పంపిన ఇరాన్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 14, 2024
04:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

రివల్యూషనరీ గార్డ్ అభివృద్ధి చేసిన రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ఇరాన్ విజయవంతంగా ప్రవేశపెట్టింది. రెండోసారి ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిందని ఆ దేశ మీడియా స్పష్టం చేసింది. ఈ ఉపగ్రహ ప్రయోగం పశ్చిమ దేశాలలో బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలపై ఆందోళనను పెంచింది. ఇరాన్ తన యురేనియం సుసంపన్నాన్ని ఆయుధ స్థాయికి పెంచడంతోపాటు ఇటీవలి కాలంలో ఇజ్రాయెల్‌పై క్షిపణి, డ్రోన్ దాడులు నిర్వహించడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రయోగాన్ని Qaem-100 రాకెట్ ద్వారా ఉపయోగించారు.

Details

స్పేస్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌లను పరీక్షించడమే లక్ష్యం

ఇది 60 కిలోల బరువున్న చమ్రాన్-1 ఉపగ్రహాన్ని 550 కిలోమీటర్ల కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇది ఘన ఇంధన రాకెట్ అని తెలుస్తోంది. ఈ ఉపగ్రహం స్పేస్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌లను పరీక్షించడమే ప్రధాన లక్ష్యంగా ఉంది. ఉపగ్రహ ప్రయోగాలు UN భద్రతా మండలి తీర్మానాన్ని ఉల్లంఘిస్తున్నాయని గతంలో పేర్కొంది. అణ్వాయుధాలను మోసుకెళ్లగల క్షిపణులతో ఎలాంటి పనులు చేయకూడదని కోరింది. అయితే, UN ఆంక్షల గడువు గత అక్టోబరుతో ముగిసింది. తాజా ప్రయోగంపై అమెరికా అధికారికంగా స్పందించలేదు. ఇరాన్ అంతరిక్ష కార్యక్రమం గతంలో మందగించినప్పటికీ, ప్రస్తుతం దాన్ని వేగవంతం చేసింది.