
3I/ATLAS: 3I/అట్లాస్ ఒంటరిగా లేదా?..'అదృశ్య అన్వేషణ పరికరం' మార్స్ ను తాకే అవకాశం ఉందన్న శాస్త్రవేత్తలు
ఈ వార్తాకథనం ఏంటి
అంతరిక్షంలో సంచరిస్తున్న 3I/Atlas అనే ఇంటర్‌స్టెల్లార్ వస్తువు ఒంటరిగా కాదని, దానితోపాటు కనిపించని ఒక 'ప్రోబ్' ముందుకు దూసుకుపోతుందని హార్వర్డ్ శాస్త్రవేత్త అవి లోబ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రహస్య ప్రోబ్ మార్స్ వైపు దారి మళ్లించి ఎర్ర గ్రహాన్ని ఢీకొనే అవకాశం ఉందని ఆయన చెబుతున్నారు. అక్టోబర్‌లో ఈ వస్తువు మార్స్‌కు అత్యంత సమీపంలోకి రానుందని, అప్పటికి ఇది కేవలం 2.7 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుందని లోబ్ తెలిపారు. అక్టోబర్ 3న అయితే ఇది మార్స్ నుండి 29 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది సహజమైన మార్గంలో దూరం తగ్గడం కాదు కాబట్టి,3I/Atlas ఒక సాధారణ అంతరిక్ష రాయి కాకుండా,ఏదో ప్రత్యేకంగా కుదించబడిన వస్తువని ఆయన భావిస్తున్నారు.
వివరాలు
మార్స్ వైపు అదృశ్య ప్రోబ్ ?
లోబ్ చేసిన మరో ఆసక్తికరమైన అంచనా ప్రకారం,భూమి నుండి కనిపించని చిన్న అంతరిక్ష వస్తువు 3I/Atlasతో పాటు ప్రయాణిస్తోంది. ఇది నేరుగా కాకుండా పక్కదారి పట్టి మార్స్ వైపు వెళ్తోందని ఆయన గణనల్లో తేలిందట. ఇది నిజమే అయితే, అక్టోబర్ 3, 2025 లేదా దాని ముందు వారంలో ఆ ప్రోబ్ మార్స్‌ను తాకే అవకాశముంది. అయితే ఇప్పటివరకు జేమ్స్ వెబ్ టెలిస్కోప్, హబ్బుల్ లేదా మరే ఇతర టెలిస్కోపులు కూడా ఆ రహస్య భాగస్వామిని గుర్తించలేకపోయాయి. కారణం - ఆ వస్తువు వంద మీటర్ల కంటే చిన్నదై ఉండే అవకాశం ఉంది.
వివరాలు
గుర్తించే మార్గం ఏంటి?
ఈ 'ప్రోబ్'ను గుర్తించడానికి మార్స్ రీకానైసెన్స్ ఆర్బిటర్‌లోని HiRISE కెమెరా వాడాలని లోబ్ సూచించారు. అక్టోబర్ 3న ఆ కెమెరా 30 కి.మీ. ప్రతి పిక్సెల్ రిజల్యూషన్‌తో 3I/Atlasను ఫోటో తీయగలదట. అంతేకాకుండా దాని న్యూక్లియస్, డస్ట్ క్లౌడ్ కూడా ఫోటోలో పడతాయి. అవి సహజమైన ధూమకేతువుల లక్షణాలకు సరిపోరని, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ డేటా కూడా దీనిని నిర్ధారిస్తోందని ఆయన చెప్పారు.
వివరాలు
భూమిపై ఎలియన్స్ దాడి?
3I/Atlas నిజంగా ఎలియన్ నాగరికతకు చెందినదై ఉంటే భూమిని పరిశీలించడానికి లేదా దాడి చేయడానికి వస్తోందని లోబ్ ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి ప్రపంచ దేశాలు ఒకే వేదికపైకి వచ్చి ఈ ప్రమాదాన్ని ఎదుర్కొనే ప్రణాళిక సిద్ధం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే మిగతా శాస్త్రవేత్తలు ఆయన అభిప్రాయాన్ని అంగీకరించడం లేదు. కానీ ప్రతి కొత్త పరిశీలనతో 3I/Atlas రహస్యం మరింత గాఢంగా మారుతోంది.
వివరాలు
3I/Atlas వేగం,వయసు
ఇప్పటి గణనల ప్రకారం 3I/Atlas గంటకు 2,09,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. అంటే ఒక్క సెకనులోనే 60 కిలోమీటర్ల దూరం కవర్ చేస్తోంది. దీని వయసు సుమారు 7 బిలియన్ సంవత్సరాలు అని శాస్త్రవేత్తలు లెక్కించారు. దీనిని పోల్చితే, మన సౌర కుటుంబం వయసు సుమారు 4 బిలియన్ సంవత్సరాలే.