LOADING...
ISRO GSLV : నేడు GSLV F-14 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ 
ISRO GSLV : నేడు GSLV F-14 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్

ISRO GSLV : నేడు GSLV F-14 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 16, 2024
11:41 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) షార్ సెంటర్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌-14 రాకెట్‌ ప్రయోగం జరగనుంది. గురువారం షార్‌లోని బ్రహ్మప్రకాష్‌ హాలులో జరిగిన మిషన్‌ రెడీనెస్‌ రివ్యూ (ఎంఆర్‌ఆర్‌) సమావేశం అనంతరం లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు (ఎల్‌ఏబీ) ప్రయోగ పనులకు ఆమోదం తెలిపింది. తదనంతరం,లాంచ్ ఆథరైజేషన్ బోర్డు ఛైర్మన్ అధ్యక్షతన ల్యాబ్ సమావేశం నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నం 2.05 నుండి కౌంట్‌డౌన్ తర్వాత GSLV F-14 రాకెట్‌ను ప్రయోగించనున్నారు.

Details 

పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో చేసే 10వ ప్రయోగం

ఈ మిషన్ లక్ష్యం 2,272 కిలోల బరువున్న ఇన్‌శాట్-3DS ఉపగ్రహాన్ని భూమికి 36,000 కి.మీ ఎత్తులో ఉన్న భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టడం. ఇది షార్ కేంద్రం నుండి 92వ ప్రయోగం. GSLV సిరీస్‌లో 16వ ప్రయోగం,అలాగే ఇస్రో శాస్త్రవేత్తలు పూర్తి స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి క్రయోజెనిక్ ఇంజిన్‌ల తయారు చేసుకుని చేస్తున్న 10వ ప్రయోగం. వాతావరణ పరిస్థితుల అధ్యయనం కోసం ఈ రాకెట్ ను షార్ ప్రయోగించనుంది. ఈ ప్రయోగం విజయవంతం అవ్వాలని యావత్ భారతదేశం కోరుకుంటుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

Isro చేసిన ట్వీట్