తదుపరి వార్తా కథనం

చంద్రయాన్-3: విక్రమ్ ల్యాండర్ నుండి ప్రగ్యాన్ రోవర్ బయటకు వచ్చిన వీడియో చూసారా?
వ్రాసిన వారు
Sriram Pranateja
Aug 25, 2023
12:38 pm
ఈ వార్తాకథనం ఏంటి
చంద్రుడి మీద విక్రమ్ ల్యాండర్ ఆగస్టు 23వ తేదీన సాయంత్రం 6:04గంటలకు సురక్షితంగా దిగింది. అయితే ల్యాండర్ లో నుండి రోవర్ మాత్రం రాత్రి 10గంటల సమయంలో బయటకు వచ్చింది.
ప్రస్తుతం ప్రగ్యాన్ రోవర్ బయటకు వచ్చిన దృశ్యాలను ఇస్రో షేర్ చేసింది. ఈ వీడియోను విక్రమ్ ల్యాండర్ తీసింది. నెమ్మదిగా బయటకు వచ్చిన రోవర్, చంద్రుడి మీద దిగిన క్షణాలను ఈ వీడియోలో చూడవచ్చు.
ప్రగ్యాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్ చంద్రుడి మీద పరిశోధనలు చేస్తున్నాయి. 14రోజుల పాటు ఇవి చంద్రుడి మీద పరిశోధనలు చేస్తూనే ఉంటాయి.
ఆ తర్వాత చంద్రుడి మీద రాత్రి ఏర్పడుతుంది కాబట్టి విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ పనిచేయకుండా ఆగిపోతాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఇస్రో ట్వీట్
... ... and here is how the Chandrayaan-3 Rover ramped down from the Lander to the Lunar surface. pic.twitter.com/nEU8s1At0W
— ISRO (@isro) August 25, 2023