LOADING...
Wi-Fi on Mars: అంగారకుడిపై లైవ్ కనెక్టివిటీ దిశగా బ్లూ ఆరిజిన్ కీలక నిర్ణయం
అంగారకుడిపై లైవ్ కనెక్టివిటీ దిశగా బ్లూ ఆరిజిన్ కీలక నిర్ణయం

Wi-Fi on Mars: అంగారకుడిపై లైవ్ కనెక్టివిటీ దిశగా బ్లూ ఆరిజిన్ కీలక నిర్ణయం

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 12, 2026
05:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

భూమి తర్వాత మనుషులు నివసించే అవకాశాలు ఎక్కువగా ఉన్న గ్రహంగా అంగారకుడు (మార్స్)ను శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అక్కడికి మానవులను పంపడం, అవసరమైన జీవన సౌకర్యాలు ఏర్పాటు చేయడం లక్ష్యంగా నాసాతో పాటు పలు ప్రైవేట్ అంతరిక్ష సంస్థలు ఇప్పటికే ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఈ క్రమంలోనే జెఫ్ బెజోస్‌కు చెందిన అంతరిక్ష సంస్థ,రెడ్ ప్లానెట్‌పై వై-ఫై సేవలు అందించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. బ్లూ ఆరిజిన్ సంస్థ మార్స్‌కు ప్రత్యేకంగా మార్స్ టెలికమ్యూనికేషన్ ఆర్బిటర్ (MTO)ను అభివృద్ధి చేస్తోంది. భవిష్యత్తులో జరిగే మార్స్ మిషన్ల సమయంలో డేటా మార్పిడిలో ఎలాంటి అంతరాయాలు తలెత్తకుండా, భూమికి సమాచారాన్ని వేగంగా పంపించేందుకు ఈ ఆధునిక ఉపగ్రహాన్ని ఉపయోగించనున్నారు.

వివరాలు 

మార్స్ కమ్యూనికేషన్ వ్యవస్థలు పాత తరహా శాటిలైట్లపైనే ఆధారం 

2028 నాటికి ఈ ఆర్బిటర్‌ను ప్రయోగించాలనే లక్ష్యంతో బ్లూ ఆరిజిన్ పనిచేస్తోంది. మార్స్‌కు సంబంధించిన డీప్ స్పేస్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌కు ఇది కీలక ఆధారంగా మారనుందని అంచనా. ప్రస్తుతం మార్స్ కమ్యూనికేషన్ వ్యవస్థలు పాత తరహా శాటిలైట్లపైనే ఆధారపడి ఉన్నాయి. అయితే సౌర శక్తి, రసాయన శక్తి కలయికతో పనిచేసే హైబ్రిడ్ ప్రొపల్షన్ వ్యవస్థలు కలిగిన MTO ఈ రంగంలో పెద్ద మార్పు తీసుకురానుంది. ఈ ఆర్బిటర్ ద్వారా 1,000 కిలోలకుపైగా బరువైన సరుకును అంతరిక్ష నౌక తీసుకెళ్లే అవకాశం ఉంటుంది.

వివరాలు 

మార్స్‌పై ఉన్న మనుషులకు తొలిసారిగా లైవ్ కనెక్టివిటీ

ఇందులో హై-స్పీడ్ డేటా రిలే పరికరాలు, ఎడ్జ్ ప్రాసెసింగ్ కోసం రూపొందించిన అధునాతన కృత్రిమ మేధ సాంకేతికత కూడా ఉంటాయి. ఈ ప్రాజెక్టును బ్లూ రింగ్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించగా, ప్రస్తుతం ఇది నిర్మాణ దశలోనే ఉంది. బ్లూ ఆరిజిన్ వెల్లడించిన వివరాల ప్రకారం, చంద్రుడిపై నిర్వహించిన మిషన్లలో ఉపయోగించిన సాంకేతికతలో సుమారు 80 శాతం వరకు మార్స్ మిషన్లలోనూ వినియోగించవచ్చు. ఎంటీఓ సహాయంతో మార్స్ నుంచి హై డెఫినిషన్ ఫోటోలు, వీడియోలు, భారీ పరిమాణంలో శాస్త్రీయ డేటాను భూమికి చాలా వేగంగా పంపించవచ్చు. దీంతో మార్స్‌పై ఉన్న మనుషులకు తొలిసారిగా లైవ్ కనెక్టివిటీ అందే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Advertisement