LOADING...
RIL AGM: జియో ఫ్రేమ్స్, జియో పీసీ, హాట్‌స్టార్‌లో వాయిస్‌ ప్రింట్ ఫీచర్స్
జియో ఫ్రేమ్స్, జియో పీసీ, హాట్‌స్టార్‌లో వాయిస్‌ ప్రింట్ ఫీచర్స్

RIL AGM: జియో ఫ్రేమ్స్, జియో పీసీ, హాట్‌స్టార్‌లో వాయిస్‌ ప్రింట్ ఫీచర్స్

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 29, 2025
04:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సాధారణ సమావేశంలో (AGM) మళ్లీ పలు కీలక ప్రకటనలు వెలువడ్డాయి. ఈసారి ఆకాశ్ అంబానీ, జియో ద్వారా వినియోగదారులకు అందించబడ్డ కొత్త సాంకేతిక పరిష్కారాలను ప్రకటించారు. టీవీని పర్సనల్‌ కంప్యూటర్‌గా మార్చే "జియో పీసీ" తో పాటు, జియో ఫ్రేమ్స్ పేరిట స్మార్ట్‌ గ్లాసెస్‌ను కూడా పరిచయం చేశారు. అదనంగా, జియో హాట్‌స్టార్‌ లో కొత్త AI ఫీచర్స్‌ను చేర్చనున్నట్లు తెలిపారు.

జియో హాట్‌స్టార్‌

జియో హాట్‌స్టార్‌లో కొత్త ఫీచర్స్ 

రిలయన్స్, వాల్ట్ డిస్నీతో కలసి ఏర్పాటు చేసిన జియోహాట్‌స్టార్, భారతదేశంలో రెండవ అతిపెద్ద వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌గా ఎదిగిందని ఆకాశ్ అంబానీ చెప్పారు. ఈ సేవను ఇతర దేశాల వరకు విస్తరించనున్నట్టు వెల్లడించారు. జియో హాట్‌స్టార్‌లో 'రియా' అనే కొత్త AI అసిస్టెంట్‌ను జోడించడం ద్వారా కంటెంట్‌ సులభంగా వెతకవచ్చని చెప్పారు. వినియోగదారులు ఎపిసోడ్స్ కోసం స్క్రోల్ చేయాల్సిన అవసరం లేకుండా,వాయిస్ కమాండ్స్ ద్వారా సెర్చ్ చేసుకోవచ్చని చెప్పారు. అలాగే,'వాయిస్‌ ప్రింట్'అనే కొత్త AI టూల్‌ను కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించారు. ఈ టూల్ ద్వారా వాయిస్ క్లోనింగ్, లిప్‌సింక్ టెక్నాలజీ ద్వారా నటులు,ప్లేయర్లు నచ్చిన భారతీయ భాషలో మాట్లాడిన మాటలను వినవచ్చు. అదనంగా, మ్యాక్స్‌వ్యూ 3.0ను కూడా AGM లో ప్రదర్శించారు.

జియో పీసీ

జియో పీసీ

జియో పీసీకి సంబంధించిన కొత్త ప్రకటనలో, టీవీని సులభంగా వర్చువల్ పర్సనల్ కంప్యూటర్‌గా మార్చవచ్చని వెల్లడించారు. కేవలం కీబోర్డును జియో సెటప్‌కు కనెక్ట్ చేయడం ద్వారా మీ టీవీని కంప్యూటర్‌గా ఉపయోగించవచ్చు. అవసరానికి అనుగుణంగా మాత్రమే చెల్లించాల్సిన విధంగా దీన్ని రూపొందించామని ఆకాశ్ అంబానీ చెప్పారు. వినియోగదారులు ఎక్కడి నుండైనా ఈ క్లౌడ్ పీసీని యాక్సెస్ చేసుకోవచ్చని, పీసీ ఎల్లప్పుడూ అప్‌డేట్‌గా ఉంటుందని చెప్పారు. అదనంగా, మెమొరీ, స్టోరేజీ, కంప్యూటింగ్ పవర్ అవసరాల మేరకు పెంచుకోవచ్చని తెలిపారు.

జియో ఫ్రేమ్స్ 

జియో ఫ్రేమ్స్ 

AGM లో జియో ఫ్రేమ్స్ పేరిట స్మార్ట్ గ్లాసెస్‌ను ఆకాశ్ అంబానీ పరిచయం చేశారు. ఈ గ్లాసెస్ ద్వారా కాల్స్ చేసుకోవడం, ఫొటోలు తీసుకోవడం,ఇయర్‌ఫోన్స్ లేకుండా సంగీతం వినడం సులభం అవుతుంది. ఇందులో బిల్ట్-ఇన్ జియో వాయిస్ AI ఉంటుంది, ఇది అన్ని భారతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది. AGM లో ధర, ఇతర వివరాలను ప్రకటించలేదు, అయితే మార్కెట్‌లో ఇప్పటికే రేబన్ స్మార్ట్‌గ్లాసెస్ రూ.29,900కి లభిస్తున్న నేపథ్యంలో, జియో ఫ్రేమ్స్ ధర ఎంత ఉంటుందో వేచిచూడాల్సి ఉంది.