Page Loader
JioHotstar: జియోహాట్‌స్టార్‌ ఫీచర్స్​​.. సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు తెలుసుకోండి  
జియోహాట్‌స్టార్‌ ఫీచర్స్​​.. సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు తెలుసుకోండి

JioHotstar: జియోహాట్‌స్టార్‌ ఫీచర్స్​​.. సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు తెలుసుకోండి  

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 14, 2025
11:49 am

ఈ వార్తాకథనం ఏంటి

జియోస్టార్ తన కొత్త స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ "జియోహాట్‌స్టార్"ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా జియోసినిమా, డిస్నీ+ హాట్‌స్టార్ అనే రెండు ప్రముఖ స్ట్రీమింగ్ సేవలు కలిసిపోయాయి. 50 కోట్లకు పైగా యూజర్ బేస్, 3 లక్షల గంటలకు పైగా కంటెంట్‌తో ఈ కొత్త ప్లాట్‌ఫామ్ భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్‌గా మారింది. జియోహాట్‌స్టార్ ఫీచర్లు ఈ ప్లాట్‌ఫామ్‌లో ఒరిజినల్ కంటెంట్‌తో పాటు, డిస్నీ, ఎన్బీసీ యూనివర్సల్ పీకాక్, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ హెచ్‌బీవో, పారామౌంట్ వంటి ప్రముఖ సంస్థల అంతర్జాతీయ కంటెంట్ కూడా అందుబాటులో ఉంటుంది. అదనంగా,క్రికెట్‌ స్ట్రీమింగ్‌కు ప్రత్యేక ప్రాధాన్యత లభిస్తోంది.ఐసీసీ మెగా ఈవెంట్స్, ఐపీఎల్, డబ్ల్యూపీఎల్, ఇతర దేశవాళీ టోర్నమెంట్లు ఈ ప్లాట్‌ఫామ్‌లో చూడవచ్చు.

వివరాలు 

జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ వివరాలు 

అలాగే ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్, వింబుల్డన్, ప్రో కబడ్డీ లీగ్, ఐఎస్‌ఎల్ వంటి వివిధ క్రీడా ఈవెంట్స్ కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి. ఈ స్ట్రీమింగ్ యాప్‌లో 4K UHD స్ట్రీమింగ్, మల్టీ-యాంగిల్ వ్యూయింగ్, AI ఆధారిత విశ్లేషణలు, రియల్-టైమ్ స్టాటిస్టిక్స్ వంటి ఆధునిక ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ కొత్త స్ట్రీమింగ్ సేవ ఉచితంగా చూడొచ్చు, అయితే యాడ్స్ ఉంటాయి. కొన్ని కంటెంట్‌లు ప్రీమియం యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లు రూ. 149 నుండి ప్రారంభమై, మూడు నెలలకు రూ. 499 ప్లాన్ అందుబాటులో ఉంది. ఇప్పటికే ఉన్న డిస్నీ+ హాట్‌స్టార్, జియోసినిమా యూజర్లు కొత్త జియోహాట్‌స్టార్‌కు మైగ్రేట్ అవుతారు.

వివరాలు 

జియోసినిమా - డిస్నీ+ హాట్‌స్టార్ విలీనం 

ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లలో డిస్నీ+ హాట్‌స్టార్ యాప్, కొత్త లోగోతో "జియోహాట్‌స్టార్"గా మారినట్లు గమనించవచ్చు. యూజర్ ఇంటర్‌ఫేస్ ప్రస్తుతానికి మారలేదు కానీ భవిష్యత్తులో అప్డేట్ అయ్యే అవకాశం ఉంది. ఇకపై Hotstar.com వెబ్‌సైట్‌కి వెళ్లిన యూజర్లకు "కంటెంట్ ఇప్పుడు జియోహాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది" అనే సందేశం కనపడుతుంది. భారత కాంపిటీషన్ కమిషన్ (CCI), నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) గత ఏడాది ఆగస్టులో డిస్నీ - రిలయన్స్ మధ్య ఈ విలీనానికి అనుమతి ఇచ్చాయి. ఈ విలీనం ద్వారా, రిలయన్స్‌కు 16% వాటా, వయాకామ్ 18 మీడియా వ్యాపారం ద్వారా 47% వాటా దక్కింది. డిస్నీ వద్ద 37% వాటా ఉంది.