Page Loader
Jiohotstar: జియో హాట్‌స్టార్ ఓటీటీ ప్రారంభం.. మీ జియో సినిమా, డిస్నీ+ హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్‌లకు ఏమి జరుగుతుంది?
జియో హాట్‌స్టార్ ఓటీటీ ప్రారంభం.. మీ జియో సినిమా, డిస్నీ+ హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్‌లకు ఏమి జరుగుతుంది?

Jiohotstar: జియో హాట్‌స్టార్ ఓటీటీ ప్రారంభం.. మీ జియో సినిమా, డిస్నీ+ హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్‌లకు ఏమి జరుగుతుంది?

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 14, 2025
04:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

వినోద ప్రపంచంలో మరో కీలక ఒటీటీ ప్లాట్‌ఫాం జియోహాట్‌స్టార్ (JioHotstar) తన ప్రవేశాన్ని ప్రకటించింది. వినియోగదారులకు 3 లక్షల గంటలకుపైగా కంటెంట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు. ఈ కొత్త ప్లాట్‌ఫాం, జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్‌లను కలిపి వినోద ప్రియులకు మెరుగైన అనుభవాన్ని అందించనుంది. ఇందులో ప్రత్యక్ష క్రీడా ప్రసారాలు కూడా ఉంటాయి. తద్వారా 50 కోట్లకు పైగా వినియోగదారులను ఆకర్షించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. వయాకామ్ 18, స్టార్ ఇండియా కలిసి ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ ద్వారా జియోస్టార్, తన కొత్త OTT ప్లాట్‌ఫాం జియోహాట్‌స్టార్‌ను ప్రవేశపెట్టింది.

వివరాలు 

ఇష్టమైన షోలు... 

ప్రతీ భారతీయుడు ప్రీమియం వినోదాన్ని అనుభవించాలనే లక్ష్యంతో జియో హాట్‌స్టార్‌ను రూపొందించామని జియోస్టార్ డిజిటల్ సీఈఓ కిరణ్ మణి తెలిపారు. వినోదాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం తమ ప్రాధాన్యత అని పేర్కొన్నారు. ఈ ప్లాట్‌ఫాం, AI ఆధారిత సిఫార్సులతో పాటు 19 భాషల్లో స్ట్రీమింగ్‌ను అందించనుంది. వినియోగదారులు తమకు నచ్చిన షోలు, సినిమాలు, లైవ్ స్పోర్ట్స్‌ను ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ అవసరం లేకుండా చూడగలుగుతారు.

వివరాలు 

కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్

వీక్షకుల అభిరుచులను దృష్టిలో ఉంచుకొని JioHotstar ఆకర్షణీయమైన సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్‌లు ₹149 నుండి ప్రారంభమవుతాయి. ప్రస్తుత జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రైబర్లు తమ సభ్యత్వాన్ని జియో హాట్‌స్టార్‌కు మార్చుకోవచ్చు. మరో ప్రత్యేకతగా 'స్పార్క్స్' అనే ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో వినూత్నమైన కంటెంట్ ఫార్మాట్లు అందుబాటులో ఉంటాయి.

వివరాలు 

లక్షలాది మందిని చేరుకునే లక్ష్యం 

భారతదేశంలో క్రీడలు కేవలం ఆటలుగా కాకుండా, అనేక మంది అభిమానులను కలిపే మాధ్యమంగా ఉంటాయని జియోస్టార్ స్పోర్ట్స్ సీఈఓ సంజోగ్ గుప్తా పేర్కొన్నారు. ఈ అనుభవాన్ని మరింత సాంకేతికంగా అభివృద్ధి చేసి, వినియోగదారులకు అందించేందుకు JioHotstar కట్టుబడి ఉందన్నారు. ఈ ప్లాట్‌ఫాం ద్వారా ICC టోర్నమెంట్లు, IPL, WPL, ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్, BCCI, రాష్ట్ర స్థాయి ఈవెంట్లు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా, ఐపీఎల్, ఛాంపియన్స్ ట్రోఫీ, ప్రీమియర్ లీగ్, ప్రో కబడ్డీ, ISL వంటి ప్రపంచ స్థాయి పోటీలను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లభిస్తుంది.

వివరాలు 

వాణిజ్య అవకాశాలు 

JioHotstar కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కాకుండా, బ్రాండ్‌లు, ప్రకటనదారులకు విస్తృతమైన అవకాశాలను అందిస్తోంది. భారీ ప్రేక్షక వర్గాన్ని కలిగి ఉండటంతో, అత్యాధునిక ప్రకటన ఫార్మాట్లు, డేటా ఆధారిత వ్యక్తిగతీకరణ విధానాలను ఉపయోగించి వ్యాపారాలు తమ వినియోగదారులతో మరింతగా కనెక్ట్ కావడానికి ఈ ప్లాట్‌ఫాం సహాయపడుతుంది.