JioHotstar: వినియోగదారులకు షాక్ ఇచ్చిన జియో హాట్‌స్టార్.. పెరగనున్న సబ్‌స్క్రిప్షన్ ధరలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ జియోహాట్‌స్టార్ వినియోగదారులకు పెద్ద షాక్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. సంస్థ తన సూపర్, ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ధరల్లో పెరుగుదలను అమలు చేయబోతోంది. ఈ విషయాన్ని సంస్థ సోమవారం అధికారికంగా ప్రకటించింది. అదే సమయంలో,అన్ని వర్గాల కోసం నెలవారీ ప్లాన్‌లను ప్రవేశపెట్టినట్లు కూడా తెలిపింది. ఈ కొత్త ప్లాన్‌లు జనవరి 28 నుండి అందుబాటులోకి రానున్నాయి. తాజా సవరణలో,ఉన్నత స్థాయి వినియోగదారులకు త్రైమాసిక,వార్షిక రేట్లలో పెంపు ఉండనుంది. అలాగే,మొబైల్ యూజర్ల కోసం రూ.79 నుంచి ప్రారంభమయ్యే తక్కువ ధర నెలవారీ ఎంట్రీ ప్లాన్‌లను కూడా పరిచయం చేసింది. అయితే, మొబైల్ వినియోగదారుల త్రైమాసిక, వార్షిక రేట్లలో ఎలాంటి మార్పు ఉండదు.
వివరాలు
కొత్త వినియోగదారులు, తక్కువకాల వినియోగదారులకు ఉపయోగకరం
అయితే, సూపర్,ప్రీమియం సబ్‌స్క్రైబర్లు ఎక్కువకాల ప్లాన్‌లను తీసుకునేటప్పుడు ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. ప్రత్యేకంగా, ప్రీమియం వార్షిక సబ్‌స్క్రిప్షన్ ధర రూ.1,499 నుండి రూ.2,199కి పెరిగింది. సూపర్ వార్షిక సబ్‌స్క్రిప్షన్ ధర రూ.899 నుండి రూ.1,099కి పెరిగింది. వీరి త్రైమాసిక సబ్‌స్క్రిప్షన్ ధరల్లో కూడా పెంపు నమోదయింది. అన్ని ప్లాన్‌లలో నెలవారీ ఆప్షన్‌లు చేరడం కొత్త వినియోగదారులు, తక్కువకాల వినియోగదారులకు ఉపయోగకరంగా ఉండనుంది. మొత్తంగా, ఈ ధరల సవరణతో జియో హాట్‌స్టార్ తన వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చింది అని చెప్పవచ్చు.
వివరాలు
సవరణ తర్వాత ధరలు ఇలా ఉన్నాయి:
Tier Plan Duration Old Price (₹) New Price (from Jan 28, 2026) (₹) Mobile Monthly Not available 79 Mobile Quarterly 149 149 Mobile Annual 499 499 Super Monthly Not available 149 Super Quarterly 299 349 Super Annual 899 1099 Premium Monthly 299 299 Premium Quarterly 499 699 Premium Annual 1499 2199