Sunita Williams : సునీతా విలియమ్స్ తిరుగు ప్రయాణంపై నేడు కీలక ప్రకటన
సునీతా విలియమ్స్ జూన్ 5 ఐఎస్ఎస్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. వారంలోగా ఆమె తిరిగి రావాల్సి ఉంది. కానీ ప్రయోగాత్మకం చేపట్టిన ఈ యాత్రలో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో సునీతా విలియమ్స్ అక్కడే ఉండిపోయింది. అంతర్జాతీయ అంతర్జాతీయ కేంద్రం(ఐఎస్ఎస్) నుంచి ఇద్దరు వ్యోమగాములను తిరిగి తీసుకొచ్చేందుకు బోయింగ్ కొత్త క్యాప్యూల్ సురక్షితంగా ఉందో లేదో ఈ వారాంతంలో నిర్ణయిస్తామని నాసా పేర్కొంది. ఈ అంశంపై అమెరికా అంతరిక్ష సంస్థ(నాసా) అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ సహా ఇతర ఉన్నతాధికారులు ఇవాళ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో సునీతా విలియమ్స్ ప్రయాణంపై ఇవాళ కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.