5 Big Events in Science & Tech 2023: ఈ ఏడాదిలో శాస్త్ర సాంకేతికలో కీలక అంశాలివే
సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ప్రపంచ దేశాలతో పాటు భారతదేశం, 2023 ఏడాది మంచి ఫలితాలను అందుకుంది.ఇంకొద్ది రోజుల్లో 2023 కాలగర్భంలో కలిసిపోనుంది. ఈ మేరకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 'ఇస్రో' దేశానికి చారిత్రక విజయాలను కట్టబెట్టింది. అత్యంత అరుదైన ఘనతను,మరే దేశానికీ సాధ్యం కాని విధంగా త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది. ఈ క్రమంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3, ఆదిత్య ఎల్1 ఉపగ్రహాలను ఈ ఏడాదే ప్రయోగించి విజయదుందుభి మోగించింది. చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసి రికార్డు సృష్టించింది.అనంతరం ఆదిత్య ఎల్1ను కూడా ప్రయోగించింది. సెప్టెంబర్ 2న సూర్యుడి వైపున నిప్పులు చిమ్ముతూ శాటిలైట్ దూసుకెళ్లింది.లాగ్రాంజ్ పాయింట్‌కు చేరుకోవాల్సి ఉన్న క్రమంలో రాకెట్ ప్రయాణం కొనసాగుతోంది.
విజయవంతంగా దూసుకెళ్తున్న ఆదిత్య ఎల్ 1
1. చంద్రయాన్ -3 చంద్రయాన్ -1 తో చంద్రుడిపై నీటి జాడని కనుగొన్న ఇస్రో చంద్రయాన్ - 2తో పాక్షిక విజయాన్ని అందుకుంది. ఇక ఈ ఏడాదిలో చంద్రుడి ఉపరితలం వద్ద, దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాడర్ ల్యాండింగ్ విజయవంతమైంది.దీంతో భారత్ ప్రపంచదేశాల దృష్టిని ఆకర్షించింది. 2. ఆదిత్య ఎల్ 1 ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆదిత్య ఎల్-1 మిషన్‌ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఆదిత్య ఎల్-1 శాటిలైట్‌ను మోసుకుంటూ PSLV-C57 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. సూర్యుడిపై ప్రయోగానికి ఇస్రో తొలి మిషన్ ఆదిత్య L1 కావడం విశేషం. ఫలితంగా సౌర వ్యవస్థను దగ్గరగా పర్యవేక్షించవచ్చు.సౌర తుఫానులు, అక్కడి వాతావరణ పరిస్థితులపై క్షుణ్ణంగా అధ్యయనానికి వీలు కలుగుతుంది.
త్వరలోనే దేశవ్యాప్తంగా గాల్లో ఎగరనున్న ఈవీ ఏయిర్ టాక్సీ
3. చాట్‌జీపీటీ (ChatGPT) చాట్‌జీపీటీ తరహాలో AI చాట్ బాట్‌ను పలు ఆమెజాన్, గూగుల్ లాంటి దిగ్గజాలు లాంచట్ చేశాయి. ఇక అమెజాన్ సంస్థ తన ప్రాడక్టు చాట్ బాట్‌కు Amazon Q అనే పేరు పెట్టింది. కంటెంట్‌లను సృష్టించడం, బ్లాగ్ పోస్టులను రాయడం వంటి పనులను 'అమెజాన్ క్యూ' సులభంగా చేస్తుందని ఆమెజాన్ ధ్రువీకరించింది.లేటెస్ట్ చాట్ బాబ్ ఆమెజాన్ క్యూ ని 'కొత్త రకం జనరేటివ్ AI పవర్డ్' అసిస్టెంట్. 4. ఏయిర్ టాక్సీ విద్యుత్ వాహకంగా నడిచే ఎయిర్ టాక్సీ త్వరలోనే దేశవ్యాప్తంగా గాల్లో ఎగరనుంది.2026లో పూర్తి స్థాయిలో ఆవిష్కరిస్తామని ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్ వెల్లడించింది. ఆర్చర్ ఏవియేషన్‌తో సంయుక్తంగా ఇంటర్‌గ్లోబ్-ఆర్చర్ ఎయిర్‌టాక్సీని దిల్లీలోని కన్నాట్ నుంచి హర్యానాలోని గురుగ్రామ్‌కు నడిపించనున్నారు.
డీప్'ఫేక్'తో డేంజరే
5. డీప్'ఫేక్'తో కష్టాలే రియల్ వీడియోలో మరొకరి ముఖాన్ని అమర్చేందుకు AIతో డీప్ లెర్నింగ్ అనే ప్రత్యేక మెషీన్ లెర్నింగ్ సాంకేతికతను వినియోగించడాన్నే డీప్‌ఫేక్ అంటారు. దీంతో వీడియో, ఫోటో, ఆడియోలో సులభంగా మార్పులు చేయవచ్చు.ఈ సాధనాన్ని ఉపయోగించడంతో ఫేక్ ఏదో, రియల్ ఏదో తెలుసుకోవడం కష్టసాధ్యం. 2018 నాటికే ఈ సాంకేతికతను మరింత అభివృద్ధి చేశారు.ఏఐ తోడవడంతో పవర్'ఫుల్‌గా మారింది. డీప్‌ఫేక్ వీడియోలను ఎన్‌కోడర్,డీకోడర్ కలయికతో తయారు చేస్తారు. కానీ, ముఖ కవలికలు, చర్మం రంగు, లైటింగ్‌ను ఒరిజినల్ వీడియోలో ఉన్న మాదిరిగా డీప్‌ఫేక్ చేయలేరు. కంటిరెప్పల కదలికలను డీప్‌ఫేక్ వీడియోలను గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు.డీప్‌ఫేక్ వీడియోలను ఏఐతో చేస్తారు. AI చేసిన వీడియోల్లో లిప్ సింకింగ్ ఎర్రర్‌లు స్పష్టంగా కనిపిస్తాయి.