సురక్షితమైన సోషల్ మీడియా అనుభవం కోసం కొత్త ఫీచర్లను ప్రకటించిన కూ
ఈ వార్తాకథనం ఏంటి
వినియోగదారులకు సురక్షితమైన సోషల్ మీడియా అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో, భారతదేశంలో ట్విటర్‌కు గట్టి పోటీనిస్తున్న కూ కొత్త ఫీచర్‌లను ప్రవేశపెట్టింది.
సోషల్ మీడియా సర్వీస్ గురువారం ఒక ప్రకటనలో యూజర్‌లకు ఆరోగ్యకరమైన కమ్యూనిటీ అందించడానికి కూ వినియోగదారుల భద్రతపై అధిక ప్రభావాన్ని చూపే కొన్ని ప్రాంతాలను గుర్తించింది, అవి పిల్లల లైంగిక వేధింపుల పదార్థాలు, నగ్నత్వం , విషపూరిత వ్యాఖ్యలు, ద్వేషపూరిత ప్రసంగాలు, తప్పుడు సమాచారం లాంటివి తొలగించడానికి కృషి చేస్తోందని పేర్కొంది.
(1.) నగ్నత్వం అల్గోరిథం: ఈ ఆప్షన్ నగ్నత్వం లేదా లైంగిక కంటెంట్‌ని ఉన్న చిత్రాన్ని లేదా వీడియోని అప్‌లోడ్ చేయడానికి చేసే ఏదైనా ప్రయత్నాన్ని ముందస్తుగా గుర్తించి 5 సెకన్ల లోపు బ్లాక్ చేస్తుంది.
ఫీచర్
కూ ప్రకటించిన కొత్త ఫీచర్లు
(2.) MisRep అల్గారిథమ్: ఈ ఫీచర్ సెలబ్రిటీలా నటించే ఖాతాల కోసం ప్లాట్‌ఫారమ్‌ను స్కాన్ చేసి అలాంటి హ్యాండిల్‌లను బ్లాక్ చేస్తుంది.
(3.) Misinfo, Disinfo అల్గారిథమ్: ఈ ఫీచర్ అన్ని వైరల్ వార్తల ఆధారంగా పబ్లిక్, ప్రైవేట్ ఫేక్ న్యూస్ మూలాలను స్కాన్ చేస్తుంది. (
4.) లైంగిక అసభ్యకరమైన కంటెంట్: లైంగిక అసభ్యకరమైన కంటెంట్‌ను పోస్ట్ చేసేవారు అటువంటి కంటెంట్‌ను పోస్ట్ చేయకుండా వెంటనే బ్లాక్ అవుతారు.
(5.) విషపూరిత వ్యాఖ్యలు, ద్వేషపూరిత ప్రసంగాలు: ఇవి 10 సెకన్లలోపు చురుకుగా గుర్తించి, ఆపై తీసివేయబడతాయి.