LOADING...
LinkedIn: లింక్డ్‌ఇన్‌లో కొత్త ఏఐ ఫీచర్..నచ్చిన పోస్టులే కనిపిస్తాయి
లింక్డ్‌ఇన్‌లో కొత్త ఏఐ ఫీచర్..నచ్చిన పోస్టులే కనిపిస్తాయి

LinkedIn: లింక్డ్‌ఇన్‌లో కొత్త ఏఐ ఫీచర్..నచ్చిన పోస్టులే కనిపిస్తాయి

వ్రాసిన వారు Moogati Shabari
Mar 14, 2026
03:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రొఫెషనల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ లింక్డ్‌ఇన్‌ తన ఫీడ్‌లో పెద్ద మార్పు చేసింది. కొత్తగా ప్రవేశపెట్టిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఆధారంగా ఈ ఫీచర్ పనిచేస్తుంది. యూజర్ ప్రొఫైల్, యాక్టివిటీని విశ్లేషించి వారికి సంబంధించిన పోస్టులను మాత్రమే చూపించేలా ఫీడ్‌ను రూపొందిస్తుంది. దీంతో యూజర్లు స్క్రోల్ చేసే సమయంలో వారికి సరిపోయే కంటెంట్ ఎక్కువగా కనిపిస్తుంది. అనవసరమైనవి, సంబంధం లేని పోస్టులు తగ్గి, ఉపయోగకరమైన సమాచారం ఎక్కువగా అందనుంది.

వివరాలు

వాటిపై కఠిన చర్యలు

ఇక ఫీడ్‌ను మెరుగుపరచడమే కాకుండా, స్పామ్ తరహా కార్యకలాపాలపై కూడా లింక్డ్‌ఇన్ కఠిన చర్యలు తీసుకుంటోంది. ఆటోమేటెడ్ కామెంట్లు, ఎంగేజ్‌మెంట్ పోడ్స్ వంటి అనుచిత చర్యలను నియంత్రించే చర్యలు చేపడుతోంది. అదే సమయంలో కొత్తగా లింక్డ్‌ఇన్‌లో చేరే యూజర్ల కోసం "ఇంటరెస్ట్ పికర్" అనే ఫీచర్‌ను కూడా పరీక్షిస్తోంది. ఇందులో సైన్‌అప్ సమయంలో యూజర్లు తమకు ఆసక్తి ఉన్న విషయాలను ఎంపిక చేసుకుంటే, మొదటి రోజునుంచే వారికి అనుకూలంగా ఫీడ్ కనిపించేలా ప్లాట్‌ఫారమ్ రూపొందిస్తుంది.

Advertisement