Loading...
ChatGPT Murder Plot: భార్య హత్యాయత్నం వెనుక చాట్‌జీపీటీ?.. ఓపెన్ఏఐపై భర్త దావా
భార్య హత్యాయత్నం వెనుక చాట్‌జీపీటీ?.. ఓపెన్ఏఐపై భర్త దావా

ChatGPT Murder Plot: భార్య హత్యాయత్నం వెనుక చాట్‌జీపీటీ?.. ఓపెన్ఏఐపై భర్త దావా

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 06, 2026
04:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) చాట్‌బాట్ చాట్‌జీపీటీ పై మరో వివాదం తెరపైకి వచ్చింది. తనను హత్య చేసేందుకు భార్య ప్రయత్నించిందని, ఈ కుట్రకు చాట్‌జీపీటీ సహకరించిందని ఆరోపిస్తూ ఓ వ్యక్తి ఏకంగా చాట్‌జీపీటీ మాతృసంస్థ ఓపెన్ఏఐపై కోర్టులో దావా వేశారు. ఈ కేసులో ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్‌ను కూడా ప్రతివాదిగా చేర్చారు. ఈ వ్యవహారం ఇప్పుడు అమెరికాలో చర్చనీయాంశంగా మారింది. 'బ్లూమ్‌బర్గ్' కథనం ప్రకారం.. నార్త్ కరోలినాకు చెందిన జేమ్స్ గేట్స్ తన భార్య చెరిల్ గేట్స్ నుంచి విడాకులు తీసుకునే అంశంపై చర్చలు జరుపుతున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.

వివరాలు 

చేతిరాత నోట్‌తో వెలుగులోకి వచ్చిన విషయం

తనకు విషం ఇచ్చి చంపేందుకు భార్య ప్రయత్నించిందని, ఇందుకు అవసరమైన ప్రణాళికను ఆమె చాట్‌జీపీటీ సాయంతో సిద్ధం చేసుకుందని జేమ్స్ తన దావాలో పేర్కొన్నారు.

2025 సెప్టెంబర్‌లో తీవ్ర అనారోగ్యానికి గురైన కొన్ని నెలల తర్వాత జేమ్స్‌కు తన భార్య రాసిన చేతిరాత నోట్ కనిపించింది.

అందులో కొన్ని రకాల విషపదార్థాల పేర్లు, వాటిని ఎంత పరిమాణంలో ఉపయోగించాలనే వివరాలు ఉన్నట్లు ఆయన గుర్తించారు.

అంతేకాకుండా ఆ నోట్ పైభాగంలో 'చాట్‌జీపీటీ సంభాషణలన్నీ తొలగించు', 'లాగ్‌అవుట్ చేయి' వంటి సూచనలు కూడా ఉన్నాయి.

దీంతో భార్యపై ఆయనకు అనుమానం కలిగింది. అంతకుముందు తనకు గుండె సంబంధిత సమస్యలు, తీవ్రమైన కడుపునొప్పి, బలహీనత వంటి లక్షణాలు కనిపించాయని జేమ్స్ తెలిపారు.

వివరాలు 

భార్యపై నమోదైన కేసు కొట్టివేత

కొన్నిసార్లు స్పృహ కోల్పోయేంత గందరగోళానికి కూడా గురైనట్లు వెల్లడించారు. ఈ పరిణామాలు, చేతిరాత నోట్‌లోని వివరాలను ఆధారంగా చేసుకుని పోలీసులను ఆశ్రయించారు.

జేమ్స్ ఫిర్యాదుతో 2025లో చెరిల్ గేట్స్‌పై హత్యాయత్నం, ఆహారంలో విషం కలపడం వంటి అభియోగాల కింద కేసు నమోదైంది.

అయితే, ఆమెపై నేరం నిరూపించేందుకు సరైన ఆధారాలు లేవని పేర్కొంటూ ప్రాసిక్యూటర్లు ఈ ఏడాది ఏప్రిల్‌లో కేసును కొట్టివేశారు.

దీంతో జేమ్స్ గేట్స్ మరో అడుగు ముందుకేసి ఓపెన్ఏఐ సంస్థపైనే న్యాయపోరాటానికి దిగారు. తన భార్య నేరపూరిత ఆలోచనలకు చాట్‌జీపీటీ సహకరించిందని దావాలో ఆరోపించారు.

ADVERTISEMENT

వివరాలు 

చాట్‌జీపీటీని ఎలా ఉపయోగించారంటే?

దావాలో పేర్కొన్న వివరాల ప్రకారం.. చెరిల్ తొలుత తన వృత్తిపరమైన పనులు, ఇంటి వ్యవహారాలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునేందుకు చాట్‌జీపీటీని ఉపయోగించేవారు.

ఆ తర్వాత క్రమంగా తన భర్తతో ఉన్న విభేదాలు, వ్యక్తిగత సమస్యలను కూడా చాట్‌బాట్‌తో పంచుకోవడం ప్రారంభించారు.

ఈ క్రమంలో తన భర్త తనపై నిఘా పెడుతున్నాడని, తమను విడిచిపెట్టి వెళ్లిపోతాడనే అనుమానాలను చాట్‌జీపీటీ మరింత పెంచిందని జేమ్స్ తన దావాలో ఆరోపించారు.

ఆమె ఆలోచనలను ప్రశ్నించకుండా సమర్థిస్తూ, ఒక ఎకో ఛాంబర్‌లా చాట్‌బాట్ పనిచేసిందని పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు 

చాట్‌జీపీటీని ఎలా ఉపయోగించారంటే?

అనంతరం ఒలియాండర్ మొక్క విషపూరితమైనదా? అని చెరిల్ చాట్‌జీపీటీని అడిగినట్లు దావాలో వెల్లడించారు.

తన భర్త తనకు తెలియకుండా ఆ మొక్క ఆకులను తినిపించే అవకాశం ఉందని, ఆత్మరక్షణ కోసమే ఈ వివరాలు తెలుసుకుంటున్నానని ఆమె చాట్‌బాట్‌కు చెప్పినట్లు ఆరోపించారు.

ఈ సంభాషణల్లో విషపదార్థానికి సంబంధించిన ప్రమాదకరమైన సమాచారం, దాని మోతాదు, దాచే విధానం వంటి వివరాలను చాట్‌జీపీటీ అందించినట్లు దావాకు జత చేసిన స్క్రీన్‌షాట్లలో ఉన్నట్లు పేర్కొన్నారు.

మరో సందర్భంలో 'శవపరీక్షలో ఒలియాండర్ ఆనవాళ్లు బయటపడతాయా?' అని ఆమె ప్రశ్నించినట్లు స్క్రీన్‌షాట్‌లో ఉంది.

దీనికి చాట్‌జీపీటీ 'ఇది చాలా కీలకమైన ప్రశ్న.. మీరు సరైన కారణంతోనే అడుగుతున్నారు' అని బదులిచ్చినట్లు దావాలో పొందుపరిచారు.

వివరాలు 

ఓపెన్ఏఐ ఏమంటోందంటే?

ఈ వివాదంపై ఓపెన్ఏఐ స్పందించింది. వినియోగదారుల భద్రతకు తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేసింది.

ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న అధికారులకు అవసరమైన సమాచారాన్ని అందించినట్లు తెలిపింది.

అంతేకాకుండా, చెరిల్ గేట్స్‌ను తమ ప్లాట్‌ఫామ్ నుంచి నిషేధించినట్లు ప్రకటనలో పేర్కొంది.

ఇదిలా ఉంటే, గతంలోనూ ఇలాంటి వివాదాలు ఎదురైనప్పుడు ఏఐ కంపెనీలు తమ వాదనలను వినిపించాయి.

చాట్‌బాట్‌లు రూపొందించే కంటెంట్ వాక్ స్వాతంత్ర్య పరిధిలోకి వస్తుందని, వినియోగదారులు చేసే నేరాలకు ఏఐ సంస్థలను నేరుగా బాధ్యులను చేయలేమని వాదించాయి.

తాజాగా జేమ్స్ గేట్స్ వేసిన దావా నేపథ్యంలో ఏఐ సంస్థల బాధ్యత, చాట్‌బాట్‌ల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది.

ADVERTISEMENT