Loading...
Meta Fine: మెటాకు రూ.7,500 కోట్లకు పైగా జరిమానా.. ఫేస్‌బుక్‌లో ఫొటోలే కారణం!
మెటాకు రూ.7,500 కోట్లకు పైగా జరిమానా.. ఫేస్‌బుక్‌లో ఫొటోలే కారణం!

Meta Fine: మెటాకు రూ.7,500 కోట్లకు పైగా జరిమానా.. ఫేస్‌బుక్‌లో ఫొటోలే కారణం!

వ్రాసిన వారు Balachander Sharma
Nov 15, 2026
01:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫేస్‌ బుక్‌లో ఆండ్రాయిడ్ యూజర్ల గ్యాలరీ ఫొటోలు, వీడియోలను అనుమతి విషయంలో నిబంధనలు ఉల్లంఘించిందనే ఆరోపణలతో మెటాకు ఇటలీ భారీ జరిమానా విధించింది. ఇటలీ డేటా ప్రొటెక్షన్ అథారిటీ శనివారం మెటాపై €805 మిలియన్లు (సుమారు $887 మిలియన్లు) పెనాల్టీ వేసింది. భారత కరెన్సీలో ఇది రూ.7,500 కోట్లకు పైగా ఉంటుంది. యూజర్ల గ్యాలరీకి సంబంధించిన డేటాను ఫేస్‌బుక్ ఎలా యాక్సెస్ చేస్తుందనే అంశమే ఈ కేసులో ప్రధానంగా మారింది.

Details

గ్యాలరీ యాక్సెస్‌పై అభ్యంతరం

ఫేస్‌బుక్‌లో బ్రౌజ్ చేస్తున్నప్పుడు గ్యాలరీ నుంచి ఫొటోలు, వీడియోలను సూచించే "Get suggestions from gallery when browsing Facebook" అనే ఫీచర్‌ కారణంగా సమస్య మొదలైంది.

ఇటలీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఫీచర్ యూజర్‌కు స్పష్టమైన సమాచారం, ప్రత్యేక సమ్మతి లేకుండానే పనిచేసింది.

యూరోపియన్ ప్రైవసీ నిబంధనలను ఇటలీ చట్టాల్లో అమలు చేసిన నిబంధనలకు ఇది విరుద్ధమని అధికారులు తేల్చారు.

Details

ఒకే అనుమతితో పలు ఫీచర్లు

దర్యాప్తులో మరో కీలక విషయం బయటపడింది. ఈ గ్యాలరీ ఫీచర్‌ డిఫాల్ట్‌గా యాక్టివ్‌గా ఉండటంతో పాటు, ఫేస్‌బుక్‌ ఒకే పర్మిషన్ ద్వారా యాప్‌లో వేర్వేరు అవసరాలకు సంబంధించిన ఫంక్షన్లకు యాక్సెస్ కోరినట్లు అధికారులు గుర్తించారు.

ప్రైవేట్ డేటాను యాక్సెస్ చేసే సమయంలో యూజర్‌కు ఏ సమాచారం ఎందుకు ఉపయోగిస్తున్నారనే విషయం స్పష్టంగా తెలియాల్సి ఉంటుందని ఇటలీ డేటా ప్రొటెక్షన్ అథారిటీ పేర్కొంది.

ADVERTISEMENT

Details

60 రోజుల్లో మార్పులు చేయాలి

మెటాకు ఇటలీ అధికారులు 60 రోజుల గడువు ఇచ్చారు. ఈ సమయంలో వివాదాస్పద ఫీచర్‌ను నిలిపివేయడంతో పాటు, దాన్ని ఉపయోగించేందుకు ప్రత్యేక సమ్మతి తీసుకునే విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు.

ఇటలీలో సుమారు 2 కోట్ల మంది ఆండ్రాయిడ్ యూజర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఈ జరిమానా Meta Platforms Ireland Limitedపై విధించారు. దర్యాప్తుకు మెటా పూర్తిస్థాయిలో సహకరించకపోవడం కూడా పెనాల్టీ మొత్తాన్ని నిర్ణయించడంలో ప్రభావం చూపిందని అధికారులు చెప్పారు.

ఈ జరిమానా మెటా గ్లోబల్ టర్నోవర్‌లో దాదాపు 0.47 శాతంగా ఉంది.

ADVERTISEMENT