
Meta: ఒరిజినల్ క్రియేటర్ లను ప్రోత్సహించడానికి.. మెటా 10 మిలియన్లకు పైగా నకిలీ ఖాతాలను సస్పెండ్ చేసింది..
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వాడుతున్న సోషల్ మీడియా యాప్‌లలో ఫేస్ బుక్ ఒకటిగా నిలుస్తోంది. ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా యూజర్లు వీడియోలు, ఆడియోలు, రీల్స్‌ను యాక్సెస్ చేయడంతో పాటు తమ కంటెంట్‌ను ఇతరులతో పంచుకోవచ్చు. యూజర్ అనుభవాన్ని మరింతగా మెరుగుపర్చేందుకు మెటా సంస్థ తరచూ కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూ ఉంటుంది. అయితే తాజాగా మెటా ఫేక్ అకౌంట్లపై గట్టిగా దృష్టి పెట్టింది. ఫేక్ ఫేస్‌బుక్ ఐడీలను వాడే యూజర్లు ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇటీవలే మెటా సంస్థ ఫేక్ కంటెంట్ పేరుతో దాదాపు 10 మిలియన్ (కోటి) అకౌంట్లను సస్పెండ్ చేసినట్లు వెల్లడించింది.
వివరాలు
కోటికి పైగా ఫేక్ అకౌంట్లపై చర్యలు :
ఫేస్‌బుక్‌లో కోట్లకు పైగా ఉన్న ఫేక్ అకౌంట్లను తొలగించినట్లు మెటా తన అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ అకౌంట్లలో ఎక్కువ భాగం నకిలీ ప్రొఫైల్స్‌గానే ఉన్నట్లు పేర్కొంది. మీడియా నివేదికల ప్రకారం, స్పామ్ కంటెంట్ ప్రచారాన్ని అడ్డుకునేందుకు 2025లో రెండుసార్లు మెటా ఫేక్ అకౌంట్లపై చర్యలు తీసుకుంది. ఫేక్ కంటెంట్ వ్యాప్తిని తగ్గించడమే లక్ష్యంగా ఈ అకౌంట్లను సస్పెండ్ చేసింది.
వివరాలు
10 మిలియన్ల ఫేక్ అకౌంట్లు, 5 లక్షల స్పామ్ ఖాతాలు తొలగింపు :
ఒరిజినల్ క్రియేటర్లను పోలిన 10 మిలియన్లకు పైగా ఫేక్ అకౌంట్లు, 5 లక్షల స్పామ్ ఖాతాలను ఫేస్‌బుక్ నుంచి తొలగించినట్లు కంపెనీ వెల్లడించింది. ఇతరుల కంటెంట్‌ను ఎలాంటి మార్పులు లేకుండా కాపీ-పేస్ట్ చేసి, కనీస క్రెడిట్స్ కూడా ఇవ్వకుండా పునఃప్రచారం చేస్తున్న అకౌంట్లను గుర్తించి చర్యలు తీసుకుంది. ఈ రకం నకిలీ కంటెంట్ సృష్టికర్తలను గుర్తించి ఖాతాలను తొలగిస్తోంది. ఇలా ఫీడ్‌లను శుభ్రపరిచే ప్రయత్నంలో ఫేస్‌బుక్ ఉంది. పునర్వినియోగానికి లోనైన మీమ్‌లు, వైరల్ వీడియోల రద్దీని తగ్గించాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. అదే సమయంలో ఒరిజినల్ క్రియేటర్లకు ఎక్కువ దృష్టిని అందించి, వారికీ ఆదాయావకాశాలను కల్పించేలా వ్యవస్థను మారుస్తోంది.
వివరాలు
రీసైకిల్ కంటెంట్‌పై కఠిన నిబంధనలు :
2025 ప్రారంభం నుంచి మెటా ఈ కింది ప్యాట్రన్స్ ప్రదర్శించే అకౌంట్లను లక్ష్యంగా తొలగిస్తుంది. ఫేక్ ఎంగేజ్‌మెంట్ సృష్టించే ఖాతాలు. ఇతరుల కంటెంట్‌ను క్రెడిట్ ఇవ్వకుండా పునఃప్రచారం చేసే అకౌంట్లు. పాత వైరల్ కంటెంట్‌ను మళ్లీ వాడుతూ మానిటైజేషన్ కోసం ప్రయత్నించే ఖాతాలు. ఇలాంటి ఖాతాల కంటెంట్ ఇకపై ప్లాట్‌ఫారమ్‌లో కనిపించదు. వీటి ద్వారా డబ్బు సంపాదించగలిగే అవకాశాలు ఇకపై ఉండవు. అదేపనిగా చేస్తే ఖాతా సస్పెన్షన్‌కు గురికావాల్సి వస్తుంది. రీమిక్స్ చేయడం లేదా పాత కంటెంట్‌ను చిన్న మార్పులతో మళ్లీ ప్రచురించడం ఇకపై ఆమోదయోగ్యం కాదు. అయితే రీయూజ్ కంటెంట్ ఉపయోగించాలంటే కొత్త సమాచారం చేర్చి విలువను పెంచాలని మెటా స్పష్టం చేసింది.
వివరాలు
ఒరిజినల్ క్రియేటర్లకు ప్రత్యేక టూల్స్ :
రాబోయే రోజుల్లో కొత్త AI విధానాలతో పాటు మరికొన్ని కొత్త ఫీచర్లను కూడా ప్రవేశపెట్టేందుకు మెటా ప్రయత్నిస్తోంది. నకిలీ కంటెంట్‌ను గుర్తించిన ప్రతిసారి ఒరిజినల్ క్రియేటర్లకు ఆటోమేటిక్‌గా లింక్ అయ్యే విధంగా అట్రిబ్యూషన్ టూల్స్‌ను మెటా పరీక్షిస్తోంది. రీసైకిల్ చేసిన వీడియోలను ఫీడ్‌లో కనిపించకుండా చేయడం కోసం ప్లాట్‌ఫామ్ అల్గోరిథాన్ని మెరుగుపరుస్తోంది. ఫీడ్‌లో ఒరిజినల్ వెర్షన్ కంటెంట్‌ను ఎక్కువగా చూపించేలా ప్రోత్సహిస్తోంది. ఎడిట్ చేయని కంటెంట్ లేదా చిన్న మార్పులతో అప్లోడ్ చేసిన వీడియోల ద్వారా ఇకపై మానిటైజేషన్ సాధ్యం కాదు. మెటా కొత్త నిబంధనల ప్రకారం వాటర్‌మార్క్‌లు పెట్టడం, చిన్న క్లిప్‌లను కలిపి వీడియోలు తయారుచేయడం వంటి విధానాలు ఇకపై అనుమతించదు.
వివరాలు
ఒరిజినల్ క్రియేటర్లకు మెటా సూచనలు :
నిజమైన క్రియేటర్ల కోసం మెటా సంస్థ మార్గదర్శకాలను రూపొందించింది. ఒరిజినల్ కంటెంట్‌ను మాత్రమే పంచుకోవాలి. రియల్ స్టోరీ చెప్పడంపై దృష్టి పెట్టండి. అవసరంలేని హ్యాష్‌ట్యాగ్‌లు, వాటర్‌మార్క్‌లను వాడరాదు. సంబంధితమైన, నాణ్యమైన క్యాప్షన్లను ఉపయోగించాలి.
వివరాలు
క్రియేటర్లు తమ ఖాతాలను ఎలా రక్షించుకోవాలి?
మీరు కూడా ఒక కంటెంట్ క్రియేటర్ అయితే లక్షలాది మంది ఫాలోవర్లున్న మీ ఖాతాను ఫేక్ కంటెంట్‌తో ప్రమాదంలో పడవేయకండి. మెటా పాలసీలో ఒరిజినల్ కంటెంట్‌కు ప్రాముఖ్యత కల్పిస్తున్నారు. యూజర్ల అభిరుచులకు అనుగుణంగా మీ వ్యూహాన్ని తరచుగా మారుస్తూ ఉండాలి. ఫేస్‌బుక్‌లో ఉన్న అన్ని మార్గదర్శకాలను నిష్టగా పాటించాలి. ఫొటోలు, వీడియోల నాణ్యత మెరుగుపరచడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.