NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / Meta: త్వరలో ఏఐ బాట్స్‌ను పరిచయం చేయనున్న మెటా.. అసలేంటివి? ఏం చేస్తాయ్‌?
    తదుపరి వార్తా కథనం
    Meta: త్వరలో ఏఐ బాట్స్‌ను పరిచయం చేయనున్న మెటా.. అసలేంటివి? ఏం చేస్తాయ్‌?
    త్వరలో ఏఐ బాట్స్‌ను పరిచయం చేయనున్న మెటా.. అసలేంటివి? ఏం చేస్తాయ్‌?

    Meta: త్వరలో ఏఐ బాట్స్‌ను పరిచయం చేయనున్న మెటా.. అసలేంటివి? ఏం చేస్తాయ్‌?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 02, 2025
    03:20 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మెటా (Meta), ఫేస్‌ బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మాతృసంస్థ, కొత్త ఆవిష్కరణతో ముందుకొస్తోంది.

    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా పనిచేసే ఏఐ బాట్స్‌ (Meta AI Bots)ను అభివృద్ధి చేసేందుకు యోచిస్తోంది.

    ఈ ఏఐ బాట్స్‌ సాధారణ యూజర్ల తరహాలోనే అకౌంట్లను నిర్వహించగలవని సమాచారం.

    టిక్‌టాక్‌, 'ఎక్స్' వంటి ఇతర సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుంచి వచ్చే గట్టి పోటీలో మెటా ఈ కొత్త ప్రయత్నం ద్వారా ముందంజ వేసేందుకు సిద్ధమవుతోంది.

    వివరాలు 

    ఏఐ బాట్స్‌ ప్రత్యేకత ఏమిటి? 

    ఈ ఏఐ బాట్స్‌ సామాన్య యూజర్లలా ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్లను నిర్వహిస్తాయి.

    వాటికి ప్రొఫైల్ ఫొటోలు, బయో వంటి వివరాలు ఉంటాయి. కేవలం ఖాతా నిర్వహణే కాకుండా, కంటెంట్‌ను సృష్టించి పోస్ట్‌ చేయడం, ఇతర పోస్టులను లైక్‌ చేయడం, వాటిని పంచుకోవడం వంటి పనులు కూడా చేసేందుకు వీక్షణం కలిగి ఉంటాయి.

    మెటా లక్ష్యం

    మెటా ఏఐ విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌ కన్నర్‌ హేస్‌ ప్రకారం, మెటా ప్లాట్‌ఫామ్‌లను మరింత ఆకర్షణీయంగా,వినోదాత్మకంగా మార్చడం లక్ష్యమని తెలిపారు. ఇప్పటికే మెటా ఏఐ చాట్‌బాట్‌లు, ఇన్‌స్టాగ్రామ్‌ డీఎంలో ఏఐ రైటింగ్‌ టూల్స్‌, కంటెంట్‌ క్రియేటర్ల కోసం ఏఐ అవతార్‌ వంటి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు, ఏఐ బాట్స్‌ ఆధారంగా అకౌంట్లను కూడా పరిచయం చేయనుంది.

    వివరాలు 

    ఆందోళనలు

    అయితే, ఈ ఏఐ బాట్స్‌పై కొంత మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఏఐ ఆధారిత అకౌంట్ల ద్వారా తప్పుడు సమాచార ప్రచారం జరగొచ్చనే భయాలు ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

    ఈ విధమైన సాంకేతికత మెటా సేవలకు ఎంతవరకు ఉపయోగపడుతుందో, అలాగే ప్రతికూలతలను ఎలా అధిగమిస్తుందో చూడాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మెటా

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    మెటా

    సోషల్ మీడియా దిగ్గజం మెటాకు కీలక మార్కెట్‌గా భారత్‌  భారతదేశం
    వాట్సాప్ పేమెంట్స్ లో కొత్త ఫీఛర్: ఇతర యూపీఐ యాప్స్ కు చెల్లింపులు చేసే సదుపాయం  వాట్సాప్
    మెటా నుండి ఏఐ చాట్ బాట్స్ వచ్చేస్తున్నాయి.. యంగ్ యూజర్లను టార్గెట్ చేస్తున్న కంపెనీ  టెక్నాలజీ
    మెటా కొత్త ప్లాన్: ఇకపై ఫేస్‌బుక్, ఇన్‌స్టా‌లో యాడ్స్ ఉండవు  తాజా వార్తలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025