
భారతదేశంలో మార్చి 16న రానున్న Moto G73
ఈ వార్తాకథనం ఏంటి
మోటోరోలా పేరెంట్ సంస్థ Lenovo భారతదేశంలో తన తాజా 5G స్మార్ట్‌ఫోన్‌గా Moto G73ని లాంచ్ చేస్తుంది. మోటరోలా G-సిరీస్ మిడ్-బడ్జెట్ విభాగంలో వినియోదారులను ఆకర్షిస్తుంది. Moto G73 జనవరిలో గ్లోబల్ మార్కెట్‌లో ప్రారంభమైంది.
అయితే, దేశంలోనే MediaTek డైమెన్సిటీ 930 చిప్‌సెట్ ఉన్న మొదటి హ్యాండ్‌సెట్ ఇది. మార్కెట్లో ఇదే ధరలో Redmi Note 12, Realme 10 Proలతో పోటీ పడుతుంది.
ఇది లూసెంట్ వైట్, మిడ్‌నైట్ బ్లూ కలర్‌వేస్‌లో వస్తుంది. Moto G73 వెనక కెమెరా మాడ్యూల్ ఉంది, ఇందులో 50MP మెయిన్ స్నాపర్, 8MP 118-డిగ్రీ అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి.. సెల్ఫీల కోసం, ఇందులో 16MP (f/2.4) ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది.
ఫోన్
Moto G73 లాంచ్ ఆఫర్‌లో భాగంగా రూ.2,000 ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది
Moto G73 MediaTek Dimensity 930 SoC సపోర్ట్ చేస్తుంది 8GB RAM, 128GB స్టోరేజ్ తో వస్తుంది. దీనికి 5,000mAh బ్యాటరీ, 30W టైప్-సి ఫాస్ట్-చారింగ్ ఉన్నాయి. హ్యాండ్‌సెట్‌లో డాల్బీ అట్మోస్‌తో ఉన్న డ్యూయల్ స్పీకర్‌లు కూడా ఉన్నాయి. ఇది 13 5G బ్యాండ్‌లు, డ్యూయల్-సిమ్‌లు, Wi-Fi 5, బ్లూటూత్ 5.3, GPS, NFC, 3.5mm జాక్‌లకు సపోర్ట్ అందిస్తుంది.
భారతదేశంలో, Moto G73 8GB/128GB కాన్ఫిగరేషన్‌లో వస్తుంది, దీని ధర రూ.18,999. మార్చి 16 నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి వస్తుంది. లాంచ్ ఆఫర్‌లో భాగంగా, దీనికి రూ. 2,000 ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది.