
Miracle cure: జర్మనీ హాస్పిటల్‌లో వింత ఘటన.. నీలంగా మారిన రోగి మెదడు
ఈ వార్తాకథనం ఏంటి
జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ యూనివర్సిటీ హాస్పిటల్ డాక్టర్లు చేసిన ఒక వింత ఆవిష్కారం అందరినీ ఆశ్చర్యపరిచింది. మలేరియా వంటి వ్యాధులకు చికిత్స కోసం ఉపయోగించే మెథిలీన్ బ్లూ అనే పదార్థం శరీర అవయవాలను నీలిరంగులోకి మార్చేస్తోందని అధ్యయనంలో బయటపడింది. 72 ఏళ్ల వృద్ధుడి మృతదేహంపై జరిపిన పోస్ట్‌మార్టంలో ఆయన మెదడు పూర్తిగా నీలిరంగులోకి మారినట్లు వైద్యులు గమనించారు. దీనిపై 2000 నుంచి 2023 వరకు హాస్పిటల్‌లోని అన్ని కేసుల రికార్డులు పరిశీలించిన శాస్త్రవేత్తలు మొత్తం 11 కేసుల్లో 'నీలం-ఆకుపచ్చ' లేదా 'టర్కాయిజ్' రంగులో మెదడు, గుండె, ఊపిరితిత్తులు, ప్యాంక్రియాస్ వంటి అవయవాలు కనిపించాయని గుర్తించారు. ఆ రోగులందరికీ మరణానికి ముందు మెథిలీన్ బ్లూ లేదా టోలుడిన్ బ్లూ ఔషధాలు ఇచ్చినట్లు తేలింది.
వివరాలు
మెథిలీన్ బ్లూ కారణంగానే మరణాలు జరిగాయా?
ఈ పదార్థం గురించి అమెరికా ఆరోగ్య శాఖాధికారి"మిరాకిల్ క్యూర్-ఆల్"అని కూడా వ్యాఖ్యానించారని సమాచారం. సాధారణంగా ఇది డిప్రెషన్,మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్లకు కూడా వాడుతున్నారు. కేవలం 25 మిల్లీగ్రాముల చిన్న మోతాదు కూడా మెదడు రంగును మార్చేస్తుందని పరిశోధనలో తేలింది. అయితే రోగులకు 50 నుంచి 200మిల్లీగ్రాముల వరకు ఇంజెక్షన్ రూపంలో ఇచ్చారని రికార్డులు చూపుతున్నాయి. మరికొంతమందికి మరణానికి 10 గంటల ముందు వరుసగా డోసులు కూడా ఇచ్చారని తేలింది. అందరి మెదడు, గుండె రంగులు మారినట్లు కనుగొన్నారు. అయితే మెథిలీన్ బ్లూ కారణంగానే మరణాలు జరిగాయా? అనే ప్రశ్నకు శాస్త్రవేత్తలు నో చెప్పేశారు. అవయవాల రంగు మార్పు మరణాలకు కారణం కాదని,కానీ పోస్ట్‌మార్టం సమయంలో గాలి తగలగానే రంగు మరింతగా ముదురుతుందని వివరించారు.
వివరాలు
నేర పరిశోధనలలో, వైద్య పరీక్షలలో అంతరాయం
అంటే ఈ ఔషధం శరీరంలో నిలిచిపోయి అవయవాలపై రంగు మార్పు చేస్తుంది. ఇది నేర పరిశోధనలలో, వైద్య పరీక్షలలో అంతరాయం కలిగించే అవకాశముందని హెచ్చరించారు. ఈ అధ్యయనం ఫోరెన్సిక్ సైన్స్, మెడిసిన్ అండ్ పాథాలజీ జర్నల్‌లో ప్రచురితమైంది. అయితే ఈ ఔషధాన్ని ఆర్వీఎఫ్‌కే జూనియర్ వాడుతున్నారా? అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. సాధారణంగా ఇతర చికిత్సలు ఫలించని చివరి దశలో రక్తప్రసరణ, ఆక్సిజన్ సరఫరా మెరుగుపరిచేందుకు దీనిని వాడుతారు.
వివరాలు
నీటిలో నీలిరంగు ద్రావణం కలుపుతున్న దృశ్యం
ఐసీయూలో గుండెపోటు, ఆపరేషన్ సమస్యలు, సెప్టిక్ షాక్, అలాగే తీవ్ర కోవిడ్ ఇన్ఫెక్షన్లతో ఉన్న రోగులకు ఇది వాడినట్లు రికార్డులు చెబుతున్నాయి. నీలి అవయవాలు కనబడ్డ 11 కేసుల్లో 6 మందికి మెథిలీన్ బ్లూ, 5 మందికి టోలుడిన్ బ్లూ లేదా ఇతర ఔషధాలు ఇచ్చారు. ఆర్వీఎఫ్‌కే జూనియర్ తాను ఈ ఔషధం వాడుతున్నట్లు బహిరంగంగా చెప్పకపోయినా, ఫిబ్రవరిలో ఆయన ఒక వీడియోలో నీటిలో నీలిరంగు ద్రావణం కలుపుతున్న దృశ్యం బయటకు వచ్చింది.