Sunita Williams: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర కమాండర్‌గా నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్
అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌లో సునీతా విలియమ్స్ చిక్కుకుపోయిన విషయం అందరికీ తెలిసిందే. 8 రోజుల మిషన్ కోసం వెళ్లిన ఆమె, బోయింగ్ స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో ఏర్పడిన సమస్య వలన, 8 నెలలుగా అక్కడే ఉండిపోయారు. ఇప్పుడు, సునీతా విలియమ్స్ ఆ స్పేస్ స్టేషన్‌కు కమాండర్‌గా ప్రమోట్ అయ్యారు. రష్యా కాస్మోనాట్ ఒలెగ్ కోనెనెంకో ఆమెకు కమాండ్‌ను అప్పగించినట్లు నాసా ప్రకటించింది. కమాండర్ బాధ్యతలు అప్పగింత సమయంలో స్పేస్ స్టేషన్‌లో ఓ సెర్మనీ కూడా జరిగింది.
స్పేస్ స్టేషన్ కమాండర్‌గా సునీతా రెండోసారి
కోనెనెంకో స్పేస్ స్టేషన్‌లో ఏడాది పూర్తి చేసుకోబోతున్నాడు, అతనితో పాటు ట్రేసీ డైసన్, నికొలాయ్ చుబ్ త్వరలో భూమికి తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక సునీతా, స్పేస్ స్టేషన్‌లోని మైక్రోగ్రావిటీ ల్యాబ్‌లో పనిచేస్తున్నారు, ప్రధానంగా మానవ, రోబోటిక్ మిషన్లకు సంబంధించిన సాంకేతికతపై శాస్త్రీయ అధ్యయనాలను నిర్వహిస్తున్నారు. సునీతా ఈ స్పేస్ స్టేషన్ కమాండ్‌ను స్వీకరించడం ఇది రెండోసారి. 12 సంవత్సరాల క్రితం కూడా ఆమె ఈ బాధ్యతలను నిర్వహించారు. ఇప్పుడు ఆమె కీలక బాధ్యత, స్పేస్ స్టేషన్‌లో భద్రతను చూసుకోవడమే.