Page Loader
Shubhanshu Shukla: అంతరిక్ష కేంద్రంలోకి నాసా భారత గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా
అంతరిక్ష కేంద్రంలోకి నాసా భారత గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా

Shubhanshu Shukla: అంతరిక్ష కేంద్రంలోకి నాసా భారత గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 03, 2024
11:18 am

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేపట్టబోయే యాత్ర కోసం ప్రధాన వ్యోమగామిగా గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లాను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శుక్రవారం ప్రకటించింది. ఒకవేళ అనూహ్య పరిణామాల్లో ఆయన యాత్ర చేపట్టలేకుంటే బ్యాకప్ కింద గ్రూప్ కెప్టెన్ బాలకృష్ణ నాయర్‌ను ఎంపిక చేసింది. ఈ మిషన్‌తో అమెరికాతో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తోంది.

Details

యాక్సియమ్ సూచనల మేరకు ఇస్రో ఎంపిక

అంతరిక్ష సంస్థ-నాసా గుర్తింపు ఉన్న సర్వీసు ప్రొవైడర్ 'యాక్సియమ్' సంస్థ సూచలన మేరకు ఇస్రో తాజాగా ఎంపిక చేసింది. మరోవైపు ఐఎస్ఎస్‌కు యాక్సియమ్ నిర్వహించే నాలుగో మిషన్ కోసం ఆ సంస్థతో తమ మానవహిత అంతరిక్ష యాత్ర కేంద్రం ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇస్రో పేర్కొంది. నేషనల్ మిషన్ ఎసైన్‌మెంట్ బోర్డు ఇద్దరు భారత వ్యోమగాముల పేర్లను సిఫార్సు చేసినట్లు వెల్లడించింది.