Page Loader
చాట్‌జీటీపీ లాంటి ఇంటర్‌ఫేస్‌ను రెడీ చేసే పనిలో నాసా 
చాట్‌జీటీపీ లాంటి ఇంటర్‌ఫేస్‌ను రెడీ చేసే పనిలో నాసా

చాట్‌జీటీపీ లాంటి ఇంటర్‌ఫేస్‌ను రెడీ చేసే పనిలో నాసా 

వ్రాసిన వారు Stalin
Jun 26, 2023
06:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్( నాసా) అంతరిక్ష మిషన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ని భాగం చేసే పనిలో నిమగ్నమైంది. భవిష్యత్ ప్రయోగాల కోసం నాసా సొంతంగా చాట్‌జీటీపీని పోలిన ఇంటర్‌ఫేస్‌ను అభివృద్ధి చేస్తోంది. వ్యోమగాములు వారి అంతరిక్ష నౌక, మిషన్ కంట్రోలర్‌లతో సుదూర గ్రహాలు, చంద్రులను అన్వేషించే కృత్రిమ మేథస్సుతో నడిచే రోబోలతో సంభాషించడానికి నాసా అభివృద్ధి చేస్తున్న ఏఐ ఇంటర్‌ఫేస్ ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఆర్టెమిస్ మిషన్‌లో భాగంగా గ్రహాంతర అంతరిక్ష కేంద్రమైన లూనార్ గెట్‌వేపై ఏఐని మోహరించడానికి ఏర్పాట్లు చేస్తోంది.

నాసా

లూనార్ గేట్‌వేపై ఏఐ, మెషీన్ లెర్నింగ్ టెక్నాలజీలు అవసరం: నాసా 

అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములు ఉన్నప్పటికీ చంద్రుడి గేట్‌వేపై వివిధ వ్యవస్థలను ఆపరేట్ చేయడానికి ఏఐ, మెషీన్ లెర్నింగ్ టెక్నాలజీలు అవసరమని నాసా పేర్కొంది. నాసాలోని విజిటింగ్ పరిశోధకురాలు డాక్టర్ లారిస్సా సుజుకి ఏఐ గురించి మాట్లాడారు. ప్రాముఖ్యతను వివరించారు. అంతరిక్ష వాహనాలతో పరస్పరం సంభాషించాలనే ఆలోచన ఉందన్నారు. అవాంతరాలను గుర్తించడం, వాటిని పరిష్కరించడం కోసం అంతర్నిర్మిత ఏఐతో చేసిన ఇంటర్‌ప్లానెటరీ కమ్యూనికేషన్స్ నెట్‌వర్క్‌ అవసరమని ఆమె పేర్కొంది. సుజుకి ప్రస్తుతం అంతరిక్షంలో యంత్ర అభ్యాసాన్ని ఎలా ఉపయోగించాలో అధ్యయనం చేస్తోంది.