చంద్రుడిపై రెగ్యులర్ గా ప్రకంపనలు: గుర్తించిన అపోలో 17మిషన్
చంద్రుడి గురించి తెలుసుకోవాలన్న అన్వేషణలో ప్రపంచ దేశాలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నాయి. తాజాగా చంద్రుడి పై ప్రకంపనాల గురించి ఒకానొక విషయాన్ని నాసా వెల్లడి చేసింది. భూమి మీద భూకంపం వచ్చినట్టుగానే చంద్రుడిపై చంద్ర కంపనాలు ఏ విధంగా వస్తాయో ప్రస్తుతం తెలిసిపోయింది. 1972లో చంద్రుని మీదకు అపోలో 17 మిషన్ ను నాసా ప్రయోగించింది. చంద్రుడి కంపనాలను 8నెలల పాటు అపోలో 17 మిషన్ కలెక్ట్ చేసింది. ప్రస్తుతం ఈ సమాచారాన్ని, కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకుల బృందం తయారు చేసిన మిషన్ లెర్నింగ్ మోడల్ ద్వారా విశ్లేషణ చేశారు. దీని ప్రకారం చంద్రుడి కంపనాల గురించి ఆసక్తికరమైన విషయం బయటపడింది.
చంద్రుడిపై ప్రకంపనాలు ఎప్పుడు ఏర్పడుతున్నాయి?
చంద్రుడిపై సూర్యరశ్మి తీవ్రంగా ఉన్న సమయం నుండి మొదలుకొని సూర్యరశ్మి తక్కువయ్యే సమయం వరకు చంద్రుడి ప్రకంపనాలు ఉంటాయని ఈ విశ్లేషణలో తేలింది. ఇలా చంద్ర ప్రకంపనాలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయని ఈ అధ్యయనం వెల్లడి చేసింది. దీని ద్వారా భవిష్యత్తులో చంద్రుడు పైకి పంపే ప్రయోగాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవచ్చని, అలాగే చంద్రుడిపై స్థిర నివాసాలు ఏర్పరచుకునే విషయంలో అభివృద్ధి సాధించవచ్చని నాసా శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ప్రకంపనాలను దృష్టిలో పెట్టుకుని చంద్రుడి పైకి పంపే ల్యాండర్, రోవర్లను డిజైన్ చేసే అవకాశం దొరుకుతుందని, చంద్రుడిపై అన్వేషణ మరింత ఎక్కువగా చేసేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. 1