30 సంవత్సరాల తర్వాత నిలిచిపోయిన నాసా జియోటైల్ మిషన్
జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (JAXA) సహకారంతో నడిచిన నాసాకు చెందిన జియోటైల్ మిషన్ ప్రయాణం 30 సంవత్సరాల తర్వాత అధికారికంగా ముగిసింది. డేటాసెట్, భూ-ఆధారిత పరిశీలనల వాటిపై ఎన్నో పరిశోధనలు చేసింది జియోటైల్. జియోటైల్, అంతరిక్షంలో 30 సంవత్సరాల పాలనలో అనేక పురోగతులను సాధించింది. జియోటైల్ వాస్తవానికి నాలుగు సంవత్సరాల మిషన్ కోసం నిర్ణయించబడింది కానీ నాణ్యత ఉన్న డేటాను ద్వారా వెయ్యికి పైగా శాస్త్రీయ ప్రచురణలకు ఈ మిషన్ దోహదపడింది. అందుకే అనేకసార్లు ఈ మిషన్ ప్రయాణాన్ని పొడిగించాల్సి వచ్చిందని నాసా ఒక బ్లాగ్ పోస్ట్‌లో రాసింది. జియోటైల్ మిషన్ ప్రధాన లక్ష్యం భూమి మాగ్నెటోస్పియర్ తో పాటు భూగ్రహం చుట్టూ ఉండి రక్షణను ఇస్తున్న అయస్కాంత బుడగను పరిశీలించడం.
నవంబర్ లో ఈ మిషన్ కార్యకలాపాలు అధికారికంగా నిలిపివేత
1000 కిలోల బరువున్న ఈ ఉపగ్రహం జూలై 24, 1992న అంతరిక్షంలోకి వెళ్లింది. జియోటైల్‌లో రెండు డేటా రికార్డర్‌లు ఉన్నాయి, అందులో ఒకటి దాదాపు ఇరవై సంవత్సరాల పాటు డేటాను సేకరించిన తర్వాత 2012లో విఫలమైంది. రెండవది జూన్ 28, 2022న సాంకేతిక లోపాన్ని ఎదుర్కొనే వరకు దాదాపు ఒక దశాబ్దం పాటు పని చేస్తూనే ఉంది. రిమోట్‌తో రికార్డర్‌కు మరమ్మతులు చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో నాసా ఈ మిషన్ కార్యకలాపాలు నవంబర్ 28, 2022 న నిలిపేసింది. శాస్త్రవేత్తలు ఈ జియోటైల్ ద్వారా సేకరించిన డేటాను అధ్యయనం చేస్తూనే ఉంటారని 2008లో పదవీ విరమణ చేసిన నాసా మొదటి ప్రాజెక్ట్ శాస్త్రవేత్త డాన్ ఫెయిర్‌ఫీల్డ్ అన్నారు