Loading...
NASA Voyager 1: నాసా వాయేజర్‌-1 అరుదైన ఘనత.. మానవ చరిత్రలో మరో రికార్డు
నాసా వాయేజర్‌-1 అరుదైన ఘనత.. మానవ చరిత్రలో మరో రికార్డు

NASA Voyager 1: నాసా వాయేజర్‌-1 అరుదైన ఘనత.. మానవ చరిత్రలో మరో రికార్డు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 15, 2026
09:13 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) ప్రయోగించిన వాయేజర్‌-1 వ్యోమనౌక మరో అద్భుత రికార్డును సృష్టించేందుకు సిద్ధమవుతోంది. భూమి నుంచి ఒక కాంతి రోజు (లైట్‌ డే) దూరంలోకి వెళ్లబోతోంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి మానవ నిర్మిత వస్తువుగా చరిత్ర సృష్టించనుంది. ప్రస్తుతం ఈ వ్యోమనౌక భూమికి సుమారు 2,600 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుంచి వాయేజర్‌-1 పంపే సంకేతాలు కాంతి వేగంతో ప్రయాణించినప్పటికీ భూమికి చేరుకోవడానికి దాదాపు 24 గంటల సమయం పడుతోంది. అంటే.. అది భూమి నుంచి ఒక కాంతి రోజు దూరంలో ఉన్నట్లే!

వివరాలు

ఒక కాంతి సంవత్సరం దూరానికి చేరాలంటే..

ఒక కాంతి సంవత్సరం దూరంలోకి వెళ్లడానికి వాయేజర్‌-1కు మరో 18 వేల సంవత్సరాలు పడుతుందని నాసా చెబుతోంది.

అలాగే 36 వేల సంవత్సరాల కన్నా ఎక్కువ దూరం ప్రయాణిస్తే అది మరో 'నక్షత్రం'గా మారుతుందని పేర్కొన్నారు.

వివరాలు

1977లో ప్రయోగించిన వాయేజర్‌-1

వాయేజర్‌-1, వాయేజర్‌-2 వ్యోమనౌకలను 1977లో నాసా ప్రయోగించింది. ఇందులో వాయేజర్‌-1 1979లో గురు గ్రహానికి, 1980లో శని గ్రహానికి చేరువగా వెళ్లి పరిశోధనలు చేపట్టింది.

అనంతరం సౌర వ్యవస్థను దాటి అంతరిక్షంలోని నక్షత్రాల మధ్య ప్రాంతంలోకి ప్రవేశించింది.

దాదాపు ఐదు దశాబ్దాలుగా ప్రయాణం కొనసాగిస్తున్న ఈ వ్యోమనౌక.. ఇప్పటికీ శాస్త్రీయ సమాచారాన్ని భూమికి పంపుతోంది.

ADVERTISEMENT