Telangana: తెలంగాణలో నూతన AI డేటా సెంటర్.. రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 3600 ఉద్యోగాలు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబడులను సమీకరించేందుకు మరో ప్రముఖ కంపెనీ ముందుకొచ్చింది.
దావోస్ పర్యటనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం, కంట్రోల్ ఎస్ సంస్థ మధ్య ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ ఒప్పందం ప్రకారం రూ.10 వేల కోట్ల పెట్టుబడితో AI డేటా సెంటర్ క్లస్టర్ స్థాపించేందుకు MOU సంతకాలయ్యాయి.
ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, కంట్రోల్ ఎస్ సీఈవో శ్రీధర్ సమక్షంలో ఒప్పందాలను ఆవిష్కరించారు.
మంత్రి శ్రీధర్ బాబు ఈ సెంటర్‌ను తెలంగాణకు మరో మైలురాయిగా పేర్కొన్నారు.
Details
400 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్
ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో ఐటీ సేవల సామర్థ్యం పెరిగి, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
400 మెగావాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ ఏర్పాటు కానున్నది.
ఈ సెంటర్ ద్వారా 3600 మందికి ఉద్యోగావకాశాలు అందుతాయని తెలుస్తోంది. ప్రస్తుతం కంట్రోల్ ఎస్ సంస్థ హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను విజయవంతంగా కొనసాగిస్తోంది.