
Whatsapp: కొత్త ఫీచర్.. లాక్ చాట్‌తో మీ వాట్సాప్ మెసేజ్‌లు మరింత సురక్షితం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న వాట్సాప్ ఒక ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్. అయితే కొన్నిసార్లు గోప్యత (Privacy) విషయంలో వినియోగదారులు ఆందోళన చెందుతుంటారు. ముఖ్యంగా మీ ఫోన్‌ను స్నేహితుడు లేదా కుటుంబ సభ్యుడు ఉపయోగిస్తుండగా ప్రత్యేక వ్యక్తి నుండి మెసేజ్ వస్తే ఎవరు చూడొచ్చన్న అనుమానం కలుగుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా వాట్సాప్ ఒక సురక్షితమైన ఫీచర్‌ను అందిస్తోంది. దీని ద్వారా మీ చాట్స్‌ను దాచుకోవచ్చు, ఎవరూ వీటిని చూడలేరు.
Details
ఈ లాక్ చాట్ (Lock Chat) ఫీచర్‌ను ఆన్ చేయడం చాలా సులభం
1. ముందుగా మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో వాట్సాప్ ఓపెన్ చేయండి. 2. మీరు దాచాలనుకునే చాట్‌ను ఎంచుకోండి. 3. స్క్రీన్ కుడి ఎగువ మూలలో కనిపించే మూడు చుక్కల (⋮) ఐకాన్‌పై నొక్కండి. 4. అక్కడ "లాక్ చాట్" అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిని ఎంపిక చేసుకోండి. 5. వెంటనే "ఈ చాట్‌ను లాక్ చేసి దాచి ఉంచండి" అనే పాప్‌అప్ వస్తుంది. దానిపై క్లిక్ చేసి, "కొనసాగించు" బటన్ నొక్కండి. ఇలా ఎంచుకున్న చాట్ పూర్తిగా లాక్ అవుతుంది. ఆ తర్వాత, మీరు ఫోన్ బయోమెట్రిక్స్ - ఫేస్ ఐడి లేదా వేలిముద్ర ద్వారా మాత్రమే దాన్ని ఓపెన్ చేయగలరు.
Details
ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే
లాక్ చేసిన చాట్‌కి సంబంధించిన నోటిఫికేషన్లలో మెసేజ్ కంటెంట్, కాంటాక్ట్ పేరు కనిపించదు. కేవలం "1 కొత్త సందేశం" అని మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది చాట్‌ను అన్‌లాక్ చేయాలంటే ఆ వ్యక్తి చాట్‌కు వెళ్లి, వారి ప్రొఫైల్ ఓపెన్ చేయండి. అక్కడ "లాక్ చేసిన చాట్‌ను అన్‌లాక్ చేయి" అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై నొక్కితే ఆ చాట్ మళ్లీ సాధారణంగా కనిపిస్తుంది. ఈ విధంగా వాట్సాప్‌లోని లాక్ చాట్ ఫీచర్‌తో మీ వ్యక్తిగత సందేశాలు మరింత గోప్యంగా, సురక్షితంగా ఉంటాయి.