LOADING...
NOTAM: బంగాళాఖాతంపై 'నోటమ్‌' జారీ.. క్షిపణి పరీక్షలపై ఊహాగానాలు!
బంగాళాఖాతంపై 'నోటమ్‌' జారీ.. క్షిపణి పరీక్షలపై ఊహాగానాలు!

NOTAM: బంగాళాఖాతంపై 'నోటమ్‌' జారీ.. క్షిపణి పరీక్షలపై ఊహాగానాలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 31, 2026
12:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌ బంగాళాఖాతంపై నోటమ్‌ (NOTAM) జారీ చేసింది. ఫిబ్రవరి 5, 6 తేదీల్లో బంగాళాఖాత గగనతలంలో సుమారు 3,190 కిలోమీటర్ల పరిధిలో విమానాల రాకపోకలను అనుమతించమని ఎయిర్‌లైన్లకు ముందస్తు నోటీసులు ఇచ్చింది. గతంలో ఈ పరిమితి 2,530 కిలోమీటర్ల వరకే ఉండగా, ఈసారి దానిని గణనీయంగా పెంచినట్లు తెలుస్తోంది. క్షిపణి పరీక్షల కోసమే భారత్‌ ఈ నోటమ్‌ను జారీ చేసినట్లు ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. సముద్ర ఆధారిత క్షిపణి ప్రయోగానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో, ఫిబ్రవరి 5, 6 తేదీల్లో బంగాళాఖాత గగనతలంలో ఎలాంటి పౌర విమానాలు ప్రయాణించకూడదని స్పష్టం చేసింది. అయితే క్షిపణి ప్రయోగాలపై భారత ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Details

పెద్ద ఎత్తున ఆయుధ సమీకరణపై దృష్టి 

ఆపరేషన్‌ సింధూర్‌ తర్వాత భారత్‌ పెద్ద ఎత్తున ఆయుధ సమీకరణపై దృష్టి సారించింది. అదే సమయంలో స్వదేశీ ఆయుధాల తయారీని వేగవంతం చేస్తూ, వివిధ రకాల క్షిపణి పరీక్షలను కూడా చురుకుగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజా నోటమ్‌ ప్రాధాన్యం సంతరించుకుంది.

Details

నోటమ్‌ అంటే ఏమిటి?

నోటమ్‌ (Notice to Airmen) అనేది ఎయిర్‌మెన్‌కు ఇచ్చే అధికారిక నోటీసు. నిర్దిష్ట కాలంలో, నిర్దిష్ట గగనతలంలో ఉండే ప్రమాదాలు లేదా ప్రయాణ పరిమితుల గురించి పౌర, సైనిక విమానయాన సంస్థలకు ముందుగా తెలియజేయడానికి ఈ నోటీసులను జారీ చేస్తారు. సాధారణంగా క్షిపణి పరీక్షలు, రాకెట్ ప్రయోగాలు, సైనిక విన్యాసాలు లేదా యుద్ధ పరిస్థితుల్లో భద్రతా చర్యల భాగంగా నోటమ్‌లు జారీ చేయడం జరుగుతుంది.

Advertisement