
WhatsApp: వాట్సాప్ నుంచి అదిరిపోయే ఫీచర్.. మూడు యాప్‌లలో ఒకే స్టేటస్
ఈ వార్తాకథనం ఏంటి
యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొత్త కొత్త ఫీచర్లను అందించడంలో ప్రముఖ మెసేజ్ యాప్ అయిన వాట్సాప్ (WhatsApp) ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా, మరొక కొత్త సదుపాయం ద్వారా యూజర్లను ఆకట్టుకోనుంది. వాట్సప్ స్టేటస్‌ను నేరుగా ఫేస్ బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) స్టోరీలుగా షేర్ చేసే సదుపాయం త్వరలో అందుబాటులో రానుంది. ఈ విషయాన్ని మెటా (Meta) తన బ్లాగ్ పోస్ట్‌లో ప్రకటించింది.
వివరాలు
ట్సప్‌లో పెట్టే స్టేటస్‌ను నేరుగా ఈ రెండు ప్లాట్‌ఫామ్‌లలో..
సాధారణంగా, మనం నచ్చిన విషయాన్ని వాట్సప్‌లోని వారితో పంచుకోవాలంటే, స్టేటస్ ఆప్షన్‌ను ఎంచుకుంటాం. ఇప్పుడు అదే స్టేటస్‌ను ఫేస్‌బుక్ స్టోరీగా లేదా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీగా షేర్ చేయాలంటే, వాట్సప్ స్టేటస్ ఆప్షన్‌లోనే ఒక కొత్త "Facebook" అనే ఆప్షన్‌ను పరిచయం చేస్తోంది. ఇంతలో, ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ఆప్షన్ కూడా అందుబాటులోకి రానుంది. అంటే, వాట్సప్‌లో పెట్టే స్టేటస్‌ను నేరుగా ఈ రెండు ప్లాట్‌ఫామ్‌లలో స్టోరీలుగా షేర్ చేయవచ్చు. ఈ విధంగా చేయడానికి ప్రత్యేకంగా ఆ యాప్‌లకు వెళ్లి అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు.
వివరాలు
త్వరలోనే అవతార్స్, మెటా ఏఐ స్టిక్కర్స్ వంటి కొత్త ఫీచర్లు
స్టేటస్ పెట్టేటప్పుడు, "Facebook story", "Instagram story" అనే రెండు ఆప్షన్లు కనబడతాయి. వాటిని ఎనేబుల్ చేయడం ద్వారా ఈ సదుపాయాన్ని ఉపయోగించవచ్చు. అవసరం ఉంటే, ఈ ఫీచర్‌ను డిసేబుల్ చేయవచ్చు. ఈ కొత్త ఫీచర్‌ని వాట్సప్ ప్రపంచవ్యాప్తంగా రోలవుట్ చేయనుంది. త్వరలోనే అన్ని యూజర్లకు అందుబాటులో రానుంది. అదేవిధంగా, అవతార్స్, మెటా ఏఐ స్టిక్కర్స్ వంటి కొత్త ఫీచర్లు కూడా వాట్సప్‌లో అందుబాటులోకి రానున్నాయి.