LOADING...
Microsoft Copilot chat: మైక్రోసాఫ్ట్ కోపైలట్ చాట్ నుంచే కొనుగోళ్లు
మైక్రోసాఫ్ట్ కోపైలట్ చాట్ నుంచే కొనుగోళ్లు

Microsoft Copilot chat: మైక్రోసాఫ్ట్ కోపైలట్ చాట్ నుంచే కొనుగోళ్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 09, 2026
12:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

మైక్రోసాఫ్ట్ తన ఏఐ చాట్‌బాట్ అయిన కోపైలట్‌లో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా యూజర్లు చాట్ చేస్తూనే నేరుగా ప్రొడక్ట్స్ కొనుగోలు చేయవచ్చు. ఉదాహరణగా, బెడ్‌సైడ్ టేబుల్‌కి చిన్న ల్యాంప్స్ సూచించమని యూజర్ అడిగితే, కోపైలట్ ప్రొడక్ట్‌ను సూచించడమే కాకుండా పూర్తి వివరాలు చూసే ఆప్షన్‌తో పాటు వెంటనే కొనుగోలు చేసే అవకాశం కూడా చూపిస్తోంది. ఈ కొత్త ఫీచర్‌లో ఉన్న "Buy" బటన్‌పై క్లిక్ చేస్తే చెక్‌అవుట్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అక్కడే షిప్పింగ్ అడ్రస్,పేమెంట్ వివరాలు నమోదు చేసి యాప్ నుంచి బయటకు వెళ్లకుండానే కొనుగోలు పూర్తి చేయవచ్చు.

వివరాలు 

మైక్రోసాఫ్ట్ రిటైలర్లు, చెల్లింపు ప్రాసెసర్లతో భాగస్వామ్యం  

ఇటీవల చాట్‌జీపీటీలో ఓపెన్‌ఏఐ తీసుకొచ్చిన ఇలాంటి ఫీచర్‌కు ఇది దగ్గరగా ఉంది. మొత్తం మీద, ఏఐ ఆధారిత ఏజెంట్లు కస్టమర్ల తరఫున షాపింగ్ చేయడం అన్నది వేగంగా పెరుగుతున్న ట్రెండ్‌గా మారుతోంది. ఈ ఫీచర్ కోసం మైక్రోసాఫ్ట్ ఇప్పటికే పలు రిటైలర్లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అర్బన్ అవుట్‌ఫిట్టర్స్, ఆంత్రోపాలజీ, ఆష్లీ ఫర్నిచర్‌తో పాటు కొన్ని ఎట్సీ సెల్లర్లు కూడా ఇందులో ఉన్నారు. చాట్‌లో జరిగే ఈ కొనుగోళ్ల పేమెంట్స్ నిర్వహించేందుకు పేపాల్, స్ట్రైప్, షాపిఫై వంటి సంస్థలతో మైక్రోసాఫ్ట్ కలిసి పనిచేస్తోంది. ప్రస్తుతం ఈ సౌకర్యాన్ని అమెరికాలో Copilot.com ద్వారా దశలవారీగా అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

Advertisement