
Gaganyaan: అక్టోబర్ 21న గగన్‌యాన్ మిషన్ ఫస్ట్ టెస్ట్ ఫ్లైట్
ఈ వార్తాకథనం ఏంటి
అక్టోబరు 21న గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా తొలి టెస్ట్ ఫ్లైట్‌ను ఇస్రో చేపట్టనుంది. అబార్ట్ మిషన్-1(TV-D1) అని పిలువబడే టెస్ట్ వెహికల్ విమానాన్ని ప్రయోగించనున్నారు.
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నారు. ఔత్సాహికులు లాంచ్ వ్యూ గ్యాలరీ నుంచి ప్రయోగాన్ని చూడవచ్చు.
శ్రీహరికోట నుంచి శనివారం ప్రారంభించనున్న టీవీ-డీ1 మిషన్‌ను వీక్షించేందుకు ఆసక్తి ఉన్నవారు ఇస్రో వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చు.
క్రూ మాడ్యూల్‌ను సురక్షితంగా అంతరిక్షంలోకి పంపి.. దాన్ని తిరిగి భూమి మీదకు తీసుకురావడమే అబార్ట్ మిషన్-1 పరీక్ష లక్ష్యంగా ఇస్రో చెబుతోంది.
క్రూ మాడ్యూల్ భూమి మీదకు వచ్చే క్రమంలో అది బంగాళాఖాతంలో ల్యాండ్ అవుతుంది. ఆ క్రూ మాడ్యూల్‌ను తిరిగి ఇస్రో పునరుద్ధరించనున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఇస్రో ట్వీట్
Mission Gaganyaan:
— ISRO (@isro) October 7, 2023
ISRO to commence unmanned flight tests for the Gaganyaan mission.
Preparations for the Flight Test Vehicle Abort Mission-1 (TV-D1), which demonstrates the performance of the Crew Escape System, are underway.https://t.co/HSY0qfVDEH @indiannavy #Gaganyaan pic.twitter.com/XszSDEqs7w