Artemis-2: జాబిల్లి వైపు దూసుకెళ్లిన ఆర్టెమిస్-2 రాకెట్
ఈ వార్తాకథనం ఏంటి
అంతరిక్ష పరిశోధనల్లో మరో కీలక ఘట్టం నమోదైంది. నాసా (NASA) ఆధ్వర్యంలో చంద్రుడి దిశగా మానవులను పంపే లక్ష్యంతో రూపొందించిన ఆర్టెమిస్-2 మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించారు. నలుగురు వ్యోమగాములతో కూడిన 'ఓరియన్' అంతరిక్ష నౌకను మోసుకెళ్లిన ఈ రాకెట్ అమెరికాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్(Kennedy Space Center) నుంచి ఆకాశాన్ని చీల్చుకుంటూ ప్రయాణం ప్రారంభించింది. ఈ మిషన్ ప్రత్యేకత ఏమిటంటే.. ఈ రాకెట్ చంద్రుడి ఉపరితలానికి అత్యంత సమీపంగా చేరుకుని, దాని చుట్టూ ప్రదక్షిణ చేసి తిరిగి భూమికి చేరుకోనుంది. మొత్తం పది రోజుల పాటు వ్యోమగాములు అంతరిక్షంలోనే ప్రయాణించనున్నారు. ప్రయాణం పూర్తయ్యాక పసిఫిక్ మహాసముద్రంలో సురక్షితంగా ల్యాండింగ్ అయ్యేలా నాసా ముందస్తు ప్రణాళిక రూపొందించింది.
వివరాలు
భవిష్యత్తులో చంద్రుడిపై మానవులను దిగబెట్టే కార్యక్రమాలకు ఇది బలమైన పునాది
ఈ ప్రయోగం విజయవంతమైతే భవిష్యత్తులో చంద్రుడిపై మానవులను దిగబెట్టే కార్యక్రమాలకు ఇది బలమైన పునాది కానుంది. అంతేకాకుండా ఈ మిషన్‌లో తొలిసారిగా ఒక మహిళ, ఒక నల్లజాతీయుడు, అలాగే ఒక కెనడాకు చెందిన వ్యోమగామి పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఆర్టెమిస్-2 లాంచ్ సక్సెస్..
Liftoff.
— NASA (@NASA) April 1, 2026
The Artemis II mission launched from @NASAKennedy at 6:35pm ET (2235 UTC), propelling four astronauts on a journey around the Moon.
Artemis II will pave the way for future Moon landings, as well as the next giant leap — astronauts on Mars. pic.twitter.com/ENQA4RTqAc