తదుపరి వార్తా కథనం
Atlas: ఓపెన్ ఏఐ బ్రౌజర్ అట్లాస్ ఆవిష్కరణ
వ్రాసిన వారు
Sirish Praharaju
Oct 22, 2025
10:24 am
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులను ఆకట్టుకుంటున్న చాట్‌జీపీటీ ద్వారా పేరుగాంచిన ఓపెన్ఏఐ (OpenAI) సంస్థ, కృత్రిమ మేధ రంగంలో మరో ముందడుగు వేసింది. సంస్థ కొత్తగా అట్లాస్ (ChatGPT Atlas) అనే బ్రౌజర్‌ను పరిచయం చేసింది. ఈ బ్రౌజర్ కృత్రిమ మేధను ఉపయోగించి పని చేసే విధంగా రూపొందించబడిందని సీఈవో సామ్ ఆల్ట్‌మాన్ వెల్లడించారు. ప్రస్తుతం ఇది ఆపిల్ మ్యాక్ ఓఎస్‌లో అందుబాటులో ఉందని కూడా తెలిపారు. అట్లాస్ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లాగా పనిచేస్తుంది, కానీ కొత్త ఫీచర్లు, ప్రత్యేక ఇంటర్‌ఫేస్ కూడా అందిస్తుంది. సంస్థ తాము రూపొందించిన ఈ బ్రౌజర్ గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ ఇవ్వగలదని శామ్ ఆల్ట్‌మన్ వెల్లడించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఓపెన్ఏఐ చేసిన ట్వీట్
Meet our new browser—ChatGPT Atlas.
— OpenAI (@OpenAI) October 21, 2025
Available today on macOS: https://t.co/UFKSQXvwHT pic.twitter.com/AakZyUk2BV