LOADING...
OpenAI: వివిధ యాప్స్‌లో పనులు ఆటోమేట్ చేయడానికి 'వర్క్‌స్పేస్ ఏజెంట్స్'ను ప్రారంభించిన ఓపెన్‌ఏఐ
వివిధ యాప్స్‌లో పనులు ఆటోమేట్ చేయడానికి 'వర్క్‌స్పేస్ ఏజెంట్స్'ను ప్రారంభించిన ఓపెన్‌ఏఐ

OpenAI: వివిధ యాప్స్‌లో పనులు ఆటోమేట్ చేయడానికి 'వర్క్‌స్పేస్ ఏజెంట్స్'ను ప్రారంభించిన ఓపెన్‌ఏఐ

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 23, 2026
10:15 am

ఈ వార్తాకథనం ఏంటి

ఓపెన్‌ఏఐ సంస్థ చాట్‌జీపీటీ ఎంటర్‌ప్రైజ్ వినియోగదారుల కోసం 'వర్క్‌స్పేస్ ఏజెంట్స్' అనే కొత్త ఫీచర్‌ను ప్రారంభించింది. ఈ ఏఐ ఆధారిత ఏజెంట్లు Codex సాయంతో పని చేస్తూ, Slack, Salesforce వంటి థర్డ్ పార్టీ యాప్స్‌లో వినియోగదారుల తరఫున పనులు పూర్తి చేయగలవని కంపెనీ తెలిపింది. ఈ పరిణామంతో ఆంత్రోపిక్ వంటి సంస్థలతో నేరుగా పోటీకి దిగినట్టైంది. ఈ వర్క్‌స్పేస్ ఏజెంట్స్ సాధారణ ఏజెంటిక్ ఏఐ టూల్స్ కంటే భిన్నంగా, ముఖ్యంగా ఎంటర్‌ప్రైజ్ మార్కెట్‌ను లక్ష్యంగా పెట్టుకున్నట్లు OpenAI పేర్కొంది. ఒకసారి ఏజెంట్‌ను రూపొందిస్తే, అదే టీమ్‌లో అందరూ ఉపయోగించుకునేలా షేర్ చేయవచ్చని కంపెనీ వెల్లడించింది. ఈ ఏఐ ఏజెంట్లు స్వయంగా ఫైళ్లు సృష్టించడం, కోడ్ రాయడం వంటి పనులను చేయగలుగుతాయి.

వివరాలు 

వర్క్‌స్పేస్ ఏజెంట్లు క్లౌడ్ ఆధారంగా పనిచేస్తాయి

ఇప్పటికే ఉన్న కస్టమ్ జీపీటీలతో పోలిస్తే, ఇవి మరింత అధునాతనంగా పనిచేస్తూ, వివిధ టూల్స్ మధ్య సమన్వయం చేసుకుని, పనుల పురోగతిని ట్రాక్ చేస్తూ ముందుకు తీసుకెళ్తాయి. వినియోగదారుడి పర్యవేక్షణ అవసరం లేకుండానే పనులు కొనసాగించడం వీటి ప్రత్యేకతగా నిలుస్తోంది. ఇక ఈ వర్క్‌స్పేస్ ఏజెంట్లు క్లౌడ్ ఆధారంగా పనిచేస్తాయి. Claude Code తరహాలోనే, కంప్యూటర్ ఆఫ్ చేసినా కూడా ఇవి పనిని కొనసాగించగలవు. వ్యాపార సంస్థలు ఎక్కువగా ఉపయోగించే Google Workspace, Slack, Salesforce వంటి అనేక యాప్స్‌తో ఇవి అనుసంధానం అవుతాయని కంపెనీ తెలిపింది.

వివరాలు 

క్రెడిట్స్ ఆధారంగా ఛార్జీలు

ఎంటర్‌ప్రైజ్ మార్కెట్‌పై దృష్టి పెట్టిన OpenAI, Codex వినియోగాన్ని పెంచుతూ ఆదాయాన్ని పెంచే దిశగా అడుగులు వేస్తోంది. పరిశోధన దశ ముగిసిన తర్వాత, అంటే 2026 మే 6 తర్వాత, ఈ ఏజెంట్ల వినియోగానికి క్రెడిట్స్ ఆధారంగా ఛార్జీలు విధించనున్నట్లు ప్రకటించింది. అంటే ఉపయోగం పెరిగే కొద్దీ ఖర్చు కూడా పెరుగుతుందని స్పష్టం చేసింది.

Advertisement