Loading...
OpenAI :పరిశోధకులకు ఓపెన్ఏఐ బంపరాఫర్.. ఏడాది పాటు ఉచితంగా చాట్‌జీపీటీ ప్లస్.. ఎవరు అర్హులో తెలుసా?
ఎవరు అర్హులో తెలుసా?

OpenAI :పరిశోధకులకు ఓపెన్ఏఐ బంపరాఫర్.. ఏడాది పాటు ఉచితంగా చాట్‌జీపీటీ ప్లస్.. ఎవరు అర్హులో తెలుసా?

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 20, 2026
12:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

పరిశోధన రంగంలో కృత్రిమ మేధ (AI) వినియోగాన్ని మరింత పెంచే దిశగా ఓపెన్ఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో అర్హత కలిగిన పరిశోధకులకు ఏడాది పాటు ఉచితంగా 'చాట్‌జీపీటీ ప్లస్' సేవలను అందించనున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమం ద్వారా భారత్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన మొత్తం 2 లక్షల మంది పరిశోధకులు ప్రయోజనం పొందనున్నారు. నవంబర్ 30 నుంచి ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని ఓపెన్ఏఐ వెల్లడించింది. అర్హత ఉన్న పరిశోధకులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అయితే, ఈ ఉచిత సబ్‌స్క్రిప్షన్ పొందేందుకు ఎలాంటి అర్హతలు ఉండాలి? ఎవరెవరు దరఖాస్తు చేసుకోవచ్చు? అనే వివరాలు తెలుసుకుందాం.

వివరాలు 

అర్హతలు ఏమిటంటే?

ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా ఉన్నత స్థాయి పరిశోధనలు చేస్తున్నవారిని దృష్టిలో పెట్టుకుని ఓపెన్ఏఐ రూపొందించింది.

ముఖ్యంగా సైన్స్, గణితం, ఇంజినీరింగ్ రంగాల్లో పరిశోధనలు చేస్తున్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

అయితే, దరఖాస్తు సమయంలో అభ్యర్థులు తమ సంస్థాగత అనుబంధం, పరిశోధన అనుభవానికి సంబంధించిన వివరాలను తప్పనిసరిగా సమర్పించాలి.

అంతేకాకుండా, దరఖాస్తుదారులు చేపట్టిన పరిశోధనలకు సంబంధించిన పత్రాలు ఇప్పటికే arXiv, bioRxiv, ChemRxiv వంటి పరిశోధనా వేదికల్లో ప్రచురితమై ఉండాలి.

తమ పరిశోధన అంశం, దాని లక్ష్యాలు, ఇతర సంబంధిత వివరాలను కూడా స్పష్టంగా వెల్లడించాల్సి ఉంటుంది.

వివరాలు 

అర్హతలు ఏమిటంటే?

ముఖ్యంగా తమ పరిశోధనలో చాట్‌జీపీటీని ఏ విధంగా ఉపయోగించాలనుకుంటున్నారో వివరంగా తెలియజేయాలి.

పరిశోధన ప్రక్రియలో ఏఐ సాధనాలు ఎలా ఉపయోగపడతాయనే విషయాన్ని దరఖాస్తులో స్పష్టంగా పేర్కొనాలి.

నవంబర్ 30 నుంచి ఓపెన్ఏఐ దరఖాస్తులను స్వీకరించనుంది.

అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఎంపికైన పరిశోధకులకు 12 నెలల పాటు చాట్‌జీపీటీ ప్లస్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందించనుంది.

ఈ కార్యక్రమానికి సంబంధించిన దరఖాస్తు విధానం, ఇతర పూర్తి వివరాల కోసం ఓపెన్ఏఐ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

ADVERTISEMENT