Page Loader
Open AI: ఓపెన్‌ ఏఐ ఎక్స్‌ ఖాతా హ్యాక్‌.. క్రిప్టో కరెన్సీకి సంబంధించిన పోస్టు 
ఓపెన్‌ ఏఐ ఎక్స్‌ ఖాతా హ్యాక్‌.. క్రిప్టో కరెన్సీకి సంబంధించిన పోస్టు

Open AI: ఓపెన్‌ ఏఐ ఎక్స్‌ ఖాతా హ్యాక్‌.. క్రిప్టో కరెన్సీకి సంబంధించిన పోస్టు 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 24, 2024
11:34 am

ఈ వార్తాకథనం ఏంటి

'చాట్‌జీపీటీ'ను అభివృద్ధి చేసిన ఓపెన్‌ఏఐ సంస్థ ప్రస్తుతం హ్యాకర్లతో సంబంధిత సమస్యలను ఎదుర్కొంటోంది. సంస్థకు చెందిన ఒక ఎక్స్‌ ఖాతా నుండి గుర్తుతెలియని వ్యక్తి క్రిప్టో కరెన్సీపై పోస్ట్ చేశారు. ఈ పోస్టులో ఆ క్రిప్టో టోకెన్లు ఓపెన్‌ ఏఐకి సంబంధించినవిగా చెబుతూ, సంస్థ ఈ విషయాన్ని గమనించిందని ప్రకటించింది. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించింది. ఆ సంస్థ @OpenAINewsroom ఖాతా ద్వారా సాయంత్రం 7 గంటల సమయంలో ఈ పోస్టులు విడుదలయ్యాయని, ఇవి న్యూయార్క్ సహా కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్నాయని పేర్కొంది. సోమవారం ఉదయం ఈ విషయం మీడియాలోకి రావడానికి ముందు, కంపెనీ భద్రతా విభాగం సిబ్బంది ఒక అంతర్గత మెమోను పంపించారు.

వివరాలు 

ఓపెన్‌ ఏఐ చీఫ్ సైంటిస్ట్ జాకబ్ పచోకీ ఖాతా కూడా హ్యాక్

ఈ మెమోలో ఓపెన్‌ ఏఐ ఉద్యోగుల ఖాతాల హ్యాకింగ్ పై చర్చించి, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఓపెన్‌ ఏఐ సామాజిక మాధ్యమ ఖాతాల ద్వారా తప్పుడు క్రిప్టో కరెన్సీ పోస్టులు విడుదల కావడం ఇదే తొలిసారి కాదు. ఆదివారం, సంస్థ ముఖ్యమైన ఉద్యోగి జేసన్‌ వీ ఖాతా నుండి కూడా ఇటువంటి క్రిప్టో పోస్టు విడుదలైంది. ఈ ఏడాది జూన్‌లో ఓపెన్‌ ఏఐ చీఫ్ సైంటిస్ట్ జాకబ్ పచోకీ ఖాతా కూడా హ్యాక్ అయ్యింది. గత ఏడాది జూన్‌లో, కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మారియా మురాటీస్ ఖాతా తాత్కాలికంగా గుర్తుతెలియని వ్యక్తులు ఉపయోగించారు.

వివరాలు 

గూగుల్‌ గుత్తాధిపత్యానికి చెక్‌ పెట్టేందుకు 'సెర్చ్‌ జీపీటీ' 

ఏఐ ఆధారిత చాట్‌బాట్ సేవలను అందిస్తున్న చాట్‌ జీపీటీ మాతృసంస్థ ఓపెన్‌ ఏఐ కొన్నాళ్ల కిందకు కొత్త విభాగంలోకి ప్రవేశించింది. గూగుల్‌ గుత్తాధిపత్యానికి చెక్‌ పెట్టేందుకు 'సెర్చ్‌ జీపీటీ' అనే కొత్త సెర్చింజన్‌ను ప్రకటించి సంచలనం సృష్టించింది. ఈ ఏఐ ఆధారిత సెర్చింజన్, ఇంటర్నెట్‌లోని రియల్‌టైమ్‌ డేటాను యూజర్లకు అందిస్తుంది.