LOADING...
Open AI : చాట్‌జీపీటీలోకి ప్రకటనలు.. టెస్టింగ్ మొదలు!
చాట్‌జీపీటీలోకి ప్రకటనలు.. టెస్టింగ్ మొదలు!

Open AI : చాట్‌జీపీటీలోకి ప్రకటనలు.. టెస్టింగ్ మొదలు!

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 10, 2026
08:10 am

ఈ వార్తాకథనం ఏంటి

ఓపెన్‌ఏఐ సంస్థ తమ చాట్‌బాట్ సేవ అయిన చాట్‌జీపీటీలో ప్రకటనల పరీక్షలను సోమవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ ప్రకటనల టెస్టింగ్ ఫ్రీ,"గో" టియర్ వినియోగదారులపై ప్రభావం చూపనుంది. ప్రకటనలు స్పష్టంగా గుర్తించబడేలా, చాట్‌బాట్ సమాధానాల నుంచి వేరుగా కనిపించేలా ఉంటాయని ఓపెన్‌ఏఐ తెలిపింది. ఇవి వినియోగదారులకు ఉపయోగకరంగా ఉండే విధంగా ఆప్టిమైజ్ చేయబడతాయని, అలాగే వినియోగదారులు మాట్లాడుతున్న విషయం, గత చాట్లు, ప్రకటనలతో ఉన్న పూర్వపు ఇంటరాక్షన్ల ఆధారంగా చూపిస్తామని పేర్కొంది.

వివరాలు 

18 ఏళ్లలోపు వారికి ప్రకటనలు చుపించామన్నవెల్లడించిన సంస్థ 

అలాగే మోసాలు, తప్పుదోవ పట్టించే ప్రకటనల ప్రమాదాన్ని తగ్గించే రక్షణ చర్యలు తీసుకుంటామని, 18 ఏళ్లలోపు వారికి ప్రకటనలు చూపించబోమని సంస్థ వెల్లడించింది. జనవరిలో ప్రవేశపెట్టిన చాట్‌జీపీటీ గో టియర్ నెలకు 8 డాలర్లుగా ఉండి, ఫ్రీ టియర్‌తో పోలిస్తే ఫైల్ అప్‌లోడ్లు, ఇమేజ్ క్రియేషన్, మెసేజింగ్‌కు ఎక్కువ సదుపాయాలు ఇస్తుంది. ఇదే సమయంలో గూగుల్ కూడా తమ జెమినీ ఏఐ ప్లాట్‌ఫామ్‌లలో 2026 నాటికి ప్రకటనలు ఉండవచ్చని సంకేతాలు ఇచ్చినా, డీప్‌మైండ్ సీఈఓ డెమిస్ హసాబిస్ మాత్రం ప్రస్తుతం అలాంటి ప్రణాళికలు లేవని చెప్పారు.

వివరాలు 

ఉచిత సేవలను కొనసాగించేందుకు ప్రకటనలు

మరోవైపు ఓపెన్‌ఏఐకి పోటీగా ఉన్న ఆంత్రోపిక్ సంస్థ తమ క్లాడ్ చాట్‌బాట్‌లో ఇప్పట్లో ప్రకటనలు పెట్టబోమని ప్రకటిస్తూ, ప్రకటనలు సంభాషణలకు అనుకూలం కాదని వ్యాఖ్యానించింది. దీనిపై ఆంథ్రోపిక్ చేసిన వీడియో ప్రకటనలకు ప్రతిగా ఆల్ట్‌మన్ తీవ్రంగా స్పందిస్తూ, అందరికీ ఏఐ అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఉచిత సేవలను కొనసాగించేందుకు ప్రకటనలు ఒక మార్గమని తెలిపారు.

Advertisement