Page Loader
Oppo K12 Plus : ఒప్పో కే12 ప్లస్ లాంచ్.. 6400 ఎంఏహెచ్ బ్యాటరీతో అదిరే ఫీచర్లు
ఒప్పో కే12 ప్లస్ లాంచ్.. 6400 ఎంఏహెచ్ బ్యాటరీతో అదిరే ఫీచర్లు

Oppo K12 Plus : ఒప్పో కే12 ప్లస్ లాంచ్.. 6400 ఎంఏహెచ్ బ్యాటరీతో అదిరే ఫీచర్లు

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 13, 2024
10:55 am

ఈ వార్తాకథనం ఏంటి

చైనాలో ఒప్పో కే12 ప్లస్ సరికొత్త స్మార్ట్‌ ఫోన్‌ను ఒప్పో సంస్థ లాంచ్ చేసింది. అధునాతన ఫీచర్లు, శక్తివంతమైన బ్యాటరీతో ఈ స్మార్ట్‌ఫోన్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒప్పో కే12 ప్లస్‌లో డ్యూయల్ సిమ్, ఆండ్రాయిడ్ 14 ఆధారిత కలర్‌ఓఎస్ 14 వస్తుంది. 6.7 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ స్క్రీన్‌కి 120Hz రిఫ్రెష్ రేట్‌ ఉంది. ఇది మరింత స్మూత్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్‌ను అందిస్తుంది. శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్ దీనికి ప్రధానంగా పనిచేస్తుంది. 8జీబీ LPDDR4X ర్యామ్, 512జీబీ వరకు ఇన్‌బిల్ట్ స్టోరేజ్ కూడా ఉంది. ఫోటోగ్రఫీ ప్రియుల కోసం 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

Details

సెల్ఫీల కోసం 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచే అంశం 6,400 ఎంఏహెచ్ బ్యాటరీ. ఇది 80వాట్ సూపర్ VOOC ఛార్జింగ్‌ టెక్నాలజీతో వస్తుంది. దీని సాయంతో ఫోన్‌ను వేగంగా ఛార్జ్ చేసుకోవచ్చు. సెక్యూరిటీ పరంగా ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా అందులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ డిజైన్ బాగుంటుంది. దీని బరువు 192 గ్రాములు, బసాల్ట్ బ్లాక్, స్నో పీక్ వైట్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. చైనాలో 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.22,600, 12జీబీ ర్యామ్ వేరియంట్ల ధరలు వరుసగా రూ.25,000, రూ.29,800గా ఉండనున్నాయి.

Details

అక్టోబర్ 15న సేల్స్ ప్రారంభం

చైనాలో అక్టోబర్ 15న సేల్స్ ప్రారంభమవుతాయి. ఇక ఇండియాలో లాంచ్‌పై సంస్థ అధికారిక ప్రకటన ఇవ్వలేదు. కే సిరీస్ ఫోన్లకు ఉన్న డిమాండ్‌ కారణంగా త్వరలో లాంచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరిన్ని వివరాలకు సంస్థ నుంచి త్వరలో అప్డేట్లు అందనున్నాయి.