Loading...
Shenzhou-24 Crew: చైనా అంతరిక్ష కేంద్రంలోకి పాకిస్తాన్ వ్యోమగామి..   

Shenzhou-24 Crew: చైనా అంతరిక్ష కేంద్రంలోకి పాకిస్తాన్ వ్యోమగామి..   

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 24, 2026
05:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్ అంతరిక్ష పరిశోధన రంగంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది. ఆ దేశానికి చెందిన తొలి వ్యోమగామి అంతరిక్షంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. పాకిస్తాన్ వైమానిక దళంలో వింగ్ కమాండర్‌గా పనిచేస్తున్న 40 ఏళ్ల మహమ్మద్ జీషాన్ అలీ ఈ ఘనత సాధించనున్నాడు. చైనా నిర్మించిన తియాంగాంగ్ అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టనున్న తొలి విదేశీ వ్యోమగామిగా ఆయన గుర్తింపు పొందనున్నాడు. చైనా పౌరుడు కాని వ్యక్తికి ఈ అవకాశం కల్పించడం ఇదే తొలిసారి కావడం విశేషం. చైనాకు చెందిన షెంజౌ-24 మానవసహిత వ్యోమనౌక ద్వారా జీషాన్ అలీ అంతరిక్ష ప్రయాణం చేయనున్నాడు. ఈ మిషన్‌లో ఆయన పేలోడ్ స్పెషలిస్ట్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఈ ప్రయాణం కోసం చైనా మొత్తం ముగ్గురిని ఎంపిక చేసింది.

వివరాలు 

నాలుగు కీలక రంగాల్లో పరిశోధనలు

వారిలో పాకిస్తాన్‌కు చెందిన జీషాన్ అలీతో పాటు చైనా సీనియర్ వ్యోమగాములు టాంగ్ హాంగ్‌బో, వు యీ ఉన్నారు.

పాకిస్తాన్ అంతరిక్ష పరిశోధనా సంస్థ సుపార్కో, చైనా అంతరిక్ష కేంద్రం మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందం ఆధారంగా ఈ ఎంపిక ప్రక్రియ చేపట్టారు.

తియాంగాంగ్ అంతరిక్ష కేంద్రంలో ఈ మిషన్‌లో భాగంగా పలు శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించనున్నారు.

అంతరిక్ష పరిశోధనలు, బయోటెక్నాలజీ, మెటీరియల్స్ రీసెర్చ్, ఆహార భద్రత వంటి నాలుగు ప్రధాన అంశాలపై దృష్టి సారించనున్నారు.

ఈ ప్రయోగాల కోసం చైనా అంతరిక్ష కేంద్రం పాకిస్తాన్‌లోని వివిధ విశ్వవిద్యాలయాలు,పరిశోధనా సంస్థల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానించింది.

వివరాలు 

300కు పైగా దరఖాస్తులు

ఈ ప్రక్రియలో 300కు పైగా దరఖాస్తులు అందాయి. వాటిని పరిశీలించిన అనంతరం నాలుగు పరిశోధనా ప్రాజెక్టులను తుది మిషన్ కోసం ఎంపిక చేశారు.

జీషాన్ అలీ, టాంగ్ హాంగ్‌బో, వు యీ ప్రయాణించనున్న వ్యోమనౌక వాయవ్య చైనాలోని జియుక్వాన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది.

బీజింగ్ కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 8.18 గంటలకు ప్రయోగం చేపట్టనున్నట్లు ప్రకటించారు.

చైనా మానవసహిత అంతరిక్ష కార్యక్రమంలో మరో దేశానికి చెందిన వ్యోమగామి పాల్గొనడం ఇదే మొదటిసారి.

జీషాన్ అలీ తియాంగాంగ్ అంతరిక్ష కేంద్రంలో సుమారు వారం రోజుల పాటు గడపనున్నారు.

ఈ సమయంలో నిర్దేశించిన పరిశోధనలు పూర్తి చేస్తారు. అనంతరం షెంజౌ-23 వ్యోమనౌక ద్వారా భూమికి తిరిగి రానున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

ఫైటర్ పైలెట్‌గా సుదీర్ఘ అనుభవం

జీషాన్ అలీకి పాకిస్తాన్ వైమానిక దళంలో ఫైటర్ పైలెట్‌గా పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉంది.

అంతరిక్ష ప్రయాణానికి అవసరమైన ప్రత్యేక శిక్షణను చైనా స్పేస్ సెంటర్‌లో పూర్తి చేశారు.

వ్యోమనౌకను నిర్వహించడం, అంతరిక్షంలో తలెత్తే అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడం, గురుత్వాకర్షణ లేని వాతావరణానికి అలవాటు పడటం వంటి అంశాల్లో శిక్షణ పొందారు.

అంతేకాకుండా చైనా వ్యోమగాములతో సమన్వయం చేసుకోవడానికి మాండరిన్ భాషను కూడా నేర్చుకున్నారు.

ఆ భాషలో ధారాళంగా మాట్లాడగలిగే స్థాయికి చేరుకోవడం ఈ మిషన్‌లో కీలక అంశంగా మారింది.

ఈ అంతరిక్ష ప్రయాణం కోసం జీషాన్ అలీతో పాటు పాకిస్తాన్‌కు చెందిన మరో వ్యోమగామి ఖుర్రమ్ దావూద్‌ను కూడా చైనా ఎంపిక చేసింది.

ADVERTISEMENT

వివరాలు 

ఫైటర్ పైలెట్‌గా సుదీర్ఘ అనుభవం

అయితే తుది మిషన్‌లో పాల్గొనే అవకాశం జీషాన్ అలీకి దక్కింది.

అంతర్జాతీయ స్థాయిలో తన మానవసహిత అంతరిక్ష కార్యక్రమాలను విస్తరించాలనే లక్ష్యంతో చైనా ముందుకు సాగుతున్న నేపథ్యంలో, ఇతర దేశాలకు చెందిన వ్యోమగాములకు తన అంతరిక్ష కేంద్రంలో అవకాశం కల్పించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

వివరాలు 

25 కోట్ల మంది ఆశయాలకు ప్రతీకగా..

ఈ మిషన్‌కు సంబంధించి నిర్వహించిన విలేకరుల సమావేశంలో జీషాన్ అలీ, టాంగ్ హాంగ్‌బో, వు యీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీషాన్ అలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

25 కోట్ల మంది పాకిస్తానీయుల కలలు, ఆశయాలను తనతో పాటు అంతరిక్షంలోకి తీసుకెళ్తున్నానని పేర్కొన్నారు.

ఈ ప్రయాణం తమ దేశ యువతకు స్ఫూర్తినిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

వివరాలు 

25 కోట్ల మంది ఆశయాలకు ప్రతీకగా..

ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, అంతరిక్ష పరిశోధనలపై యువతలో ఆసక్తి పెరిగేందుకు ఈ మిషన్ దోహదపడుతుందని తెలిపారు.

శాస్త్ర సాంకేతిక రంగాల్లో కొత్త అవకాశాలను అన్వేషించేందుకు యువతకు ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు.

పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి తొలిసారిగా అంతరిక్ష యాత్రకు సిద్ధమవుతుండటంతో ఆ దేశ అంతరిక్ష పరిశోధన చరిత్రలో ఈ మిషన్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోనుంది.

ADVERTISEMENT