Perplexity: పర్‌ప్లెక్సిటీ నుంచి షాపింగ్‌ను సులభం చేసే AI ఫీచర్ విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలోని వినియోగదారుల కోసం షాపింగ్ అనుభవాన్ని మరింత సులభంగా, వ్యక్తిగతంగా మార్చేందుకు పర్‌ప్లెక్సిటీ కొత్త AI షాపింగ్ అసిస్టెంట్‌ను విడుదల చేసింది. పేపాల్‌తో ఇప్పటికే ఉన్న భాగస్వామ్యాన్ని ఆధారంగా తీసుకుని వచ్చిన ఈ అప్‌డేట్‌ను US యూజర్లు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఈ ఫీచర్‌తో "సాన్‌ఫ్రాన్సిస్కోలో ఉండి ఫెర్రీలో ఆఫీసుకి వెళ్తే నాకు సరిపోయే ఉత్తమ వింటర్ జాకెట్ ఏది?" వంటి వ్యక్తిగత అవసరాలకు తగ్గట్టు ఉత్పత్తులను వెతికే అవకాశం లభిస్తుంది. కొత్తగా వచ్చిన ఈ AI అసిస్టెంట్ యూజర్‌తో జరుగుతున్న చాట్‌లోని సందర్భాన్ని గుర్తుంచుకుని, అతని జీవనశైలి-అభిరుచులను ఆధారంగా తీసుకుని ఉత్పత్తులను సూచిస్తుంది.
వివరాలు
ఇన్‌స్టంట్ బై' ఫీచర్
సూచించిన ఉత్పత్తులను ప్రోస్, కాన్స్‌తో పాటు రివ్యూలు, గైడ్‌లలోని ముఖ్య సమాచారం సహా అందంగా ఫార్మాట్ చేసిన కార్డుల రూపంలో చూపిస్తుంది. యూజర్‌కు నచ్చిన ప్రొడక్ట్ దొరికితే, దానిని నేరుగా పర్‌ప్లెక్సిటీ అసిస్టెంట్ ద్వారా కొనుగోలు చేయడానికి 'ఇన్‌స్టంట్ బై' ఫీచర్ కూడా ఉంది. పేపాల్ ఖాతాలో సేవ్ చేసిన వివరాలతో వెంటనే పేమెంట్ చేయొచ్చు. పేపాల్‌ను అంగీకరించే అన్ని మెర్చెంట్లకు ఈ సదుపాయం వర్తిస్తుంది. అలాగే కొనుగోలు తర్వాత కస్టమర్‌పై నియంత్రణ, సంబంధాలు మాత్రం పూర్తిగా మెర్చెంట్‌కే ఉంటాయని పర్‌ప్లెక్సిటీ చెబుతోంది.
వివరాలు
అవసరాలకు సరిపోయే సలహాలు ఇవ్వగలిగే AI టూల్స్
ఆన్‌లైన్ షాపింగ్‌లో వ్యక్తిగతీకరణ, సౌలభ్యాన్ని ఒకేచోట కలపడానికి ప్రయత్నిస్తున్న ఈ ఫీచర్ విడుదలతో, ఓపెన్‌ఏఐ, గూగుల్ వంటి ఇతర టెక్ సంస్థలు కూడా ఇలాంటి సేవలను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో పోటీ మరింత పెరిగింది. సాధారణ ఎడిటోరియల్ షాపింగ్ గైడ్‌ల కంటే వ్యక్తిగత రుచులకు, అవసరాలకు సరిపోయే సలహాలు ఇవ్వగలిగే AI టూల్స్‌గానే వీటిని మార్కెట్ చేస్తున్నారు. అయితే చివరికి యూజర్లు ఈ సిఫార్సుల ద్వారా కొనుగోలు చేస్తే వాటిపై కమిషన్ సంపాదించడమే అసలు ఉద్దేశమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
వివరాలు
అఫిలియేట్ రివెన్యూలోనే ఆసక్తి
సాంప్రదాయ సెర్చ్ బార్లు "ఎక్స్‌ప్లోరేషన్‌లో విఫలమవుతున్నాయి", అలాగే ఎడిటోరియల్ సైట్లు "పాఠకులకు సరిపోయే ఉత్పత్తులను కాకుండా అఫిలియేట్ రివెన్యూలోనే ఆసక్తి చూపుతున్నాయి" అని పర్‌ప్లెక్సిటీ వ్యాఖ్యానించింది. ఆన్‌లైన్ షాపింగ్ త్వరగా చెకౌట్ చేయడం మీద మాత్రమే దృష్టి పెట్టి, అసలు షాపింగ్ అనుభవాన్ని మాత్రం ఇవ్వలేకపోతున్నాయని కంపెనీ పేర్కొంది. యూజర్ ఉద్దేశాన్ని అర్థం చేసుకుని, అభిరుచులను గుర్తుంచుకుని, వారు ఎలా వెతుకుతారో అలానే వ్యవహరించే అసిస్టెంట్‌గానే తమ AI ని రూపొందించామని పర్‌ప్లెక్సిటీ చెప్పింది.