
'శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్- 2023' ఈవెంట్; నేడు లాంచ్ అయ్యే కొత్త మోడల్స్ ఇవే
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ 'శాంసంగ్' బుధవారం తమ నూతన మోడల్స్‌ను విడుదల చేయనుంది.
ఇందుకోసం 'శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్- 2023(Samsung Galaxy Unpacked) పేరుతో ఈవెంట్ నిర్వహిస్తోంది.
ఈ ప్రోగ్రామ్ ఈరోజు సాయంత్రం 4:30గంటలకు ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్లో లాంచ్ కాబోయే శాంసంగ్ నూతన మోడల్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే శాంసంగ్ లాంచ్ చేయబోయే కొత్త మోడల్స్‌లో Galaxy Z Flip 5, Galaxy Z Fold 5, Galaxy 6 వాచ్, Galaxy Buds 3, truly wireless stereo ఇయర్‌ఫోన్‌లు ఉన్నాయి.
ఇదిలా ఉండే, బుధవారం శాంసంగ్ విడుదల చేసే వాటిలో శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్9 అల్ట్రా 5జీ(Samsung Galaxy Tab S9 Ultra 5G) మోడల్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్‌లు, డిజైన్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.
శాంసంగ్
అందరి దృష్టి 'శామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్9 అల్ట్రా 5జీ' పైనే
గెలాక్సీ ట్యాబ్ ఎస్9 అల్ట్రా 5జీ మోడల్ 'క్వాల్‌కమ్' ప్రాసెసర్‌తో వస్తోంది.
టాప్-టైర్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్‌సెట్‌లో ఇది రన్ అవుతుంది.
ఈ ఫోన్‌లో 12GB ర్యామ్, 512GB స్టోరేజీ ఫీచర్లు ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ట్యాబ్ ఎస్9 అల్ట్రా వేరియంట్ ప్రత్యేకమైన ఫ్లోటింగ్ బ్యాక్ కెమెరాలు ఉంటాయి. 8MPఅల్ట్రా-వైడ్-యాంగిల్ స్నాపర్‌తో పాటు 13MP ప్రైమరీ సెన్సార్ కెమెరా ఉంటుంది.
అద్భుతమైన వీడియో కాలింగ్, సెల్ఫీ అనుభవాన్ని అందించడానికి ఒక జత 12MPసామర్థ్యంతో ముందు భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది.
ట్యాబ్ ఎస్9 అల్ట్రా వేరియంట్ 14.6-అంగుళాల డైనమిక్ AMOLED డిస్‌ప్లే, డ్యూయల్-సిమ్ సపోర్ట్‌ని అందిస్తుంది.
ఎక్కువ సమయం ఛార్జింగ్ ఉండేలా 11,200mAhబ్యాటరీ ఫీచర్ ఇందులో ఉంది.