PM Modi: అక్టోబర్ 27న ఐఎంసీని ప్రారంభించనున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) దేశంలోనే అతిపెద్ద టెలికాం పరిశ్రమ అయిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) 7ఎడిషన్‌ను ప్రారంభించనున్నారు. న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో అక్టోబర్ 27న ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. మూడ్రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్‌కు 31 దేశాల నుండి 1,00,000 మంది దాకా హాజరవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో 1,300 కంటే ఎక్కువ మంది ప్రతినిధులు, 400 మందికి పైగా స్పీకర్లు, 225-ప్లస్ ఎగ్జిబిటర్లు రానున్నారు. 5G, 6G, బ్రాడ్‌కాస్టింగ్, సెమీకండక్టర్స్, డ్రోన్ పరికరాలు, గ్రీన్ టెక్నాలజీలతో సహా అనేక రకాల సాంకేతికతలపై IMC 2023 దృష్టి సారిస్తోంది. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ రెండూ తమ 5G మొబైల్ నెట్‌వర్క్‌లను ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఆస్పైర్ స్టార్టప్ ప్రోగ్రామ్ ను ప్రవేశపెట్టనున్న మొబైల్ కాంగ్రెస్
PLI పథకం కింద టెలికాం తయారీని పెంచడానికి, ఇండియాను పవర్ హౌస్‌గా మార్చడానికి ఇదే సరైన సమయమని కేంద్ర ఐటీ మంత్రి అశ్విన్ వైష్ణవ్ పేర్కొన్నారు. ఈ ఏడాది ఇండియా మొబైల్ కాంగ్రెస్ 'ఆస్పైర్' అనే స్టార్టప్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టనుంది. భారతీయ టెలికాం, డిజిటల్ పరిశ్రమలలో ఆవిష్కరించడానికి ఇది కీలక పాత్ర పోషిస్తుంది. దేశ ఆర్థికావృద్ధిని 5x నుండి 10x వరకు పెంచాలని ప్రభుత్వం, పరిశ్రమ వాటాదారులకు అశ్విన్ వైష్ణవ్ పిలుపునిచ్చారు.